Home జిల్లాలు మహోన్నత వ్యక్తి పూలే

మహోన్నత వ్యక్తి పూలే

ambedkar-jayanti.jpg2కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి
అణగారిన వర్గాల కోసం పూలే ఎంతో కృషి చేశారు : ఎస్పీ
కులవ్యవస్థను బద్ధలు కొట్టాలి : ఎంపీ బూర నర్సయ్యగౌడ్
స్ఫూర్తిదాత పూలే : ఎమ్మెల్సీ పూల

నల్లగొండ టౌన్ :స్త్రీ విద్యతోనే సమాజంలో సాంఘిక దూరాచారాలను రూపుమాపిన మహోన్నత వ్యక్తి పూలే అని జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి అన్నారు. సోమవారం గడియారం సెంటర్‌లో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే 190వ జయంతి ఉత్సవాలు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్త్రీ విద్య అన్నీటికి మూలం. సమాజంలో ఉన్న కుల, మత, ఆర్ధిక అసమానాలతను తొలగించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించడంలో మహాత్మా జ్యోతిరావు పూలే విజయం సాధించారన్నారు. పూలే సామాజిక సంఘసంస్కర్త అని, విద్యయొక్క ప్రాముఖ్యతను అందరికంటే ముందు గ్రహించిన మహనీయుడని కొనియాడారు. సాంఘీక దురాచారాలను  రూపు మాపడానికి విద్య ఉపయోగపడుతుందన్నారు. మహిళలకు ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నాడు. పూలే, సావిత్రిబాయి పూలే జీవిత ఆశయాలను, పూల జయంతి రోజున ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్‌ను, సావిత్రి పుట్టిన రోజున మహిళా అక్షరాస్యత దినోత్సవం ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదిక పంపిస్తానని తెలిపారు. జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ మాట్లాడుతూ, అణగారిన వర్గాల కోసం పూలే ఎంతో కృషి చేశాడని, సాంఘీక సంస్కరణలను గ్రామస్థ్ధాయిలో ఏ విధంగా తీసుకోవాలో ఆలోచించిన వ్యక్తి అన్నారు. సావిత్రిబాయి పూలే దేశంలోమొట్టమొదటి మహిళా టీచర్ అన్నారు. ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ, అందరూ చదువుకొని కుల వ్యవస్థను బద్దలు కొట్టాలని ఆయన సూచించారు. మహాత్మా జ్యోతిరావుపూలే సమసమాజ అభివృద్ధికి కృషి చేశాడని వారి స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణ, దళిత విప్లవ నేత డాక్టర్ బిఆర్.అంబేద్కర్‌కు జ్యోతిరావు పూలే స్ఫూర్తి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏజెసి వెంకట్రావు, వివిధ శాఖల అధికారులు, సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బిసి కార్పోరేషన్ ద్వారా 67 మంది లబ్దిదారులకు 73 లక్షల రుణాల చెక్కులను, ఐసిడిఎస్ ద్వారా బాలికల సంరక్షణ పథకం కింద 12 మందికి ఒక్కొక్కరి లక్ష రూపాయల చొప్పున పది మందికి 30వేల చొప్పున అందజేశారు.
సిపిఐ ఆఫీసులో..
దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సిపిఐ కార్యాలయంలో జ్యోతిరావు పూలే 190వ జయంతి ఉత్సవం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్‌రావు, పల్లా దేవేందర్‌రెడ్డి, నాయకులు కెఎస్.రెడ్డి, లెనిన్, నర్సింహ్మ, వెంకటేశం, శ్రీనివాస్, ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా గ్రంధాలయంలో సంస్ధ అధ్యక్షులు అల్లం ప్రభాకర్‌రెడ్డి, కట్ట నాగయ్య, నాగేశ్వరరావు, నర్సమ్మ, అంజనేయులు, అనిత తదితరులు పాల్గొన్నారు. జిల్లా టిడిపి కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జీ కంచర్ల భూపాల్‌రెడ్డి, నాయకులు ఎం.శ్రీనివాస్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, గొవర్దన్, ఎల్‌వి.యాదవ్, సహదేవరెడ్డి, యుగేందర్‌రెడ్డి, మధుసూధన్‌రెడ్డి, పురుషోత్తం, మల్లేష్‌గౌడ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎంసిసిజిలో డైరెక్టర్ పాముల అశోక్ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యానాల ప్రభాకర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, జివి.రావు, మహేష్, శివ, శశిలు పాల్గొన్నారు.
హాలియాలో…
మన తెలంగాణ/ హాలియా: మహాత్మా జ్యోతిరావుపూలే 190వ జయంతి వేడుకలను సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ బడుగు , బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే అని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఓంప్రకాష్, ఆర్.ఐ. ఉమ, ఎంపీపీ అల్లి నాగమణిపెద్దిరాజు, ఎంపీడీవో జానయ్య, సర్పంచ్ జూపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బి.సి. సంక్షేమ సంఘం అధ్వర్యంలో బి.సి. సంక్షేమ సంఘం అధ్యక్షులు జవ్వాజి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ఎమ్‌ఆర్‌పీఎస్, ఎమ్‌ఈఎఫ్ ఆధ్వర్యంలో హాలియా సి.ఐ. పార్థసారధి పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల అధ్యక్షులు ఇరిగి రామయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కనకరాజు సామేలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. బిజేపీ ఆధ్వర్యంలో నియోజకవర్గ కన్వీనర్ చెన్ను వెంకట్‌నారాయణరెడ్డి, మండల అధ్యక్షులు పోగుల నాగార్జునరెడ్డి, ఆనంద్, సైదాచారి, ప్రవీణ్, శంకర్, నాగయ్య, మంగయ్య, సతీష్, నులక వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనుముల మండలం చల్మారెడ్డిగూడెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూలే చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకట రమణారెడ్డి, ఉపాధ్యాయులు లిల్లిథెరిస్సా, అరవింద్‌కుమార్, సైదులురావుగౌతమ్, సునిత, సుధాకర్, రామకృష్ణ; మానస, రేణుక, దివ్వ, మనీష, విజిత, విజయ్, నాగరాజు, రజిత, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
చిట్యాలలో…
మన తెలంగాణ/చిట్యాల : మహాత్మాజ్యోతిబా పూలే 190 వ జయంతిని చిట్యాల మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. మండల పరిషత్తు కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంచార్జ్ ఎంపిడిఓ లాజర్, కార్యదర్శులు పాల్గొన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ కార్యాల యంలో మండల పార్టీ అధ్యక్షులు కాటం వెంకటేశం అద్యక్షతన పూలే జయంతిని జరుపుకున్నారు. పూలే ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపిపి బట్టు అరుణ, జడ్‌పిటిసి శేపూరిరవీందర్, సర్పంచ్ శ్రీలక్ష్మి, నాయకులు ఏనుగు నర్సింహారెడ్డి, బెల్లి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
తిప్పర్తిలో…
మన తెలంగాణ/తిప్పర్తి : అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ అట్టడుగు వర్గాలకు విద్యా అవకాశాలు కల్పిస్తూ నిరుపేద బడుగుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిబాపూలే అని జడ్పిటిసి తండు సైదులుగౌడ్, ఎంపీపీ పాశం రాంరెడ్డిలు పేర్కొన్నారు. తిప్పర్తి జడ్పిటిసి కార్యాలయంలో జడ్పిటిసి తండు సైదులుగౌడ్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పాశం రాంరెడ్డి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తహశీల్ధార్ చంద్రవదన, ఎంపిడిఓ మహేందర్‌రెడ్డి, రంగారెడ్డి, రామచంద్రయ్య, నాగయ్య, రవీందర్‌రెడ్డి, లోడంగి వెంకన్న, గిరి, యాదగిరి, గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
హుజూర్‌నగర్‌లో..
మన తెలంగాణ/ హుజూర్‌నగర్ రూరల్ : స్థానిక కాంగ్రెస్‌పార్టీ కార్యాలయం ఇందిరా భవన్‌లో పట్టణ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఐఎన్‌టి యుసి జిల్లా అధ్యక్షులు యరగాని నాగన్నగౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్, అరుణ్ కుమార్ చిట్యాల అమర్‌నాద్ రెడ్డి, గొట్టె రామయ్య, గల్లా వెంకటేశ్వర్లు, యరగాని గువయ్య, సుతారి వేణు, శ్రవన్‌కుమార్, గిరిబాబు, నాగేశ్వరరావు, గురవయ్య, ముక్కంటి, ఉపేందర్ జానయ్య పాల్గొన్నారు.