Home మంచిర్యాల గుట్టుగా.. గుట్కా దందా

గుట్టుగా.. గుట్కా దందా

gutka

*మంచిర్యాలలో రూ.3.50లక్షల గుట్కాల పట్టివేత
*రూ.కోట్లలో సాగుతున్న వ్యాపారం
*ఇతర రాష్ట్రాల నుంచి కోల్‌బెల్ట్‌కు దిగుమతి
*రహస్య ప్రదేశాలలో అక్రమ నిలువలు
*పోలీసులు దాడులు చేస్తున్నా ఆగని వైనం
*నిద్రావస్థలో నియంత్రణ అధికారులు

మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి : జిల్లాలో నిషేధిత గుట్కాల వ్యాపారం జోరుగా సాగుతోంది. కోట్లాది రూపాయ ల్లో అక్రమ దందా యథేచ్చగా సాగుతున్నప్పటికీ నియంత్రణ అధికారులు పట్టించుకోకుండా నిద్రావస్థలో తూలుతున్నారు. ఇటీవల కాలంలో సివిల్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు ని ర్వహించి లక్షలాది రూపాయల గుట్కాలను స్వాధీనం చేసుకున్నప్పటికీ వ్యాపారులు పోలీసుల కళ్లుకప్పి అక్రమ దందాను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని కోల్‌బెల్ట్ ప్రాంతం లో రహస్య ప్రదేశాలల్లో పెద్ద ఎత్తున గోడౌన్‌లను ఏర్పాటు చేసి, కోట్లాది రూపాయల గుట్కాలను నిల్వ ఉంచుతున్నారు.
రూ.3.50 లక్షల విలువైన గుట్కాల పట్టివేత..
తాజాగా పాత మంచిర్యాలలో శనివారం రూ. 3.50 లక్షల విలువ చేసే గుట్కాలను రామగుండం టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ అశో క్ ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించి, పట్టుకున్నారు. పాతమంచిర్యాలలోని వేముల హన్మంతు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిషేధిత గుట్కాలను పెద్దమొత్తంలో దాచి ఉంచినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ఆకస్మిక దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దా డులు నిర్వహించిన అనంతరం రెండురోజుల పాటు గుట్కా స్టాక్‌ను వ్యాపారులు బ్లాక్ చేసి, మళ్లీ ధరలు పెంచుతూ విక్రయాలు జరుపుతున్నారు. కోల్‌బెల్ట్‌లో గుట్కా ప్రియులు అధికంగా ఉన్నందు వలన అక్రమ గుట్కా దందా మూడు పువ్వు లు ఆరు కాయలుగా సాగుతోంది. గత నెల రోజుల నుంచి మంచిర్యాల, బెల్లంపల్లి, తాండూర్, చెన్నూర్, జన్నారం, మం దమర్రి పట్టణాల్లో పో లీసులు అకస్మికంగా దాడులు నిర్వహించి దాదాపు రూ.21లక్షల విలు వ చేసే గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. అ యితే తెలంగాణలో గుట్కాలు, పొగాకు అధారిత పదార్థాల విక్రయాలను నిలిపివేయగా కొందరు వ్యాపారులు కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుం చి పెద్ద ఎత్తున కోల్‌బెల్ట్‌కు దిగుమతి చేస్తున్నారు. రాష్ట్రంలో గుట్కా, పొగాకు సంబంధిత పదార్థాల తయారి, అమ్మకాల నియంత్రణకు గాను 8 విభాగాలకు ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. ఇందులో వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, వాణిజ్య పన్ను లు, కార్మిక శాఖ, పురపాలక అధికారులు, పోలీసులు, రవాణా శాఖ, పంచాయతీ రాజ్‌శాఖల స మన్వయంతో పని చేస్తూ గుట్కాల విక్రయాలను అరికట్టాలని, అంతే కాకుండా జిల్లాల సరిహద్దు ల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, విజిలెన్స్ తనిఖీలతో అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాల ని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అధికారుల నిర్లక్షం కారణంగా కార్యరూపం దాల్చలేదు. పోలీసు శాఖ వివిధ సందర్భాల్లో చెడు వ్యసనాలపై అవగాహన సదస్సులు చేపడుతున్నప్పటికీ వ్యాపారుల ధనార్జన వల్ల గుట్కాలను మా ర్కెట్‌లోకి తీసుకువస్తుండడం వల్ల గుట్కా ప్రియు లు వ్యసనాలకు దూరం కావడం లేదు. అనేక మం ది సింగరేణి కార్మికులు, యువకులు గుట్కాలకు బానిసలుగా మారుతున్నారు. రూ.2కు లభించే గుట్కాలను వ్యాపారులు రూ.10 నుంచి రూ.15 వరకు విక్రయిస్తుండగా గుట్కా ప్రియుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. గుట్కా వ్యాపారం లో ఆరితేరినా కొందరు వ్యాపారులు సగానికంటే ఎక్కువ లాభం ఉండడంతో ఎవరికి అనుమానం రాకుండా పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు గాను కూరగాయలు తరలించే పెట్టేల్లో నింపి, కూరగాయలు తీసుకువచ్చే వాహనాల్లోనే పట్టణ ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఏదీ ఏమైనా కోల్‌బెల్ట్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన స్థావరాలపై దాడులు చేసినట్లయితే కోట్లా ది విలువ చేసే గుట్కాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.