Thursday, April 25, 2024

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: హిమాన్షు

- Advertisement -
- Advertisement -

Himanshu who planted plants on his birthday

మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ మనువడు హిమాన్షు పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యుడు, బాబాయి జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి మంగళవారం మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వాటిని నాటడమే కాదు సంరక్షించినప్పుడు మాత్రమే మనం అనుకున్న లక్ష్యాలను సాధించుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా హిమాన్షుపై ఎంపీ సంతోష్ కుమార్ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. హరితహారం కార్యక్రమం ప్రారంభించిన మీ తాతయ్య అడుగుజాడ్ల్లో నడుస్తూ మీ పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క్లు నాటడం సంతోషంగా ఉందన్నారు. మీరు మీ నాన్నలా, తాతయ్యలా అంకితభావంతో ఉన్నారనడానికి ఇది నిదర్శనమని సంతోష్ కుమార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

మొక్కలు నాటిన జర్నలిస్ట్ రోజా

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్‌ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో యోయో టివి మానేజింగ్ డైరెక్టర్, జర్నలిస్ట్ రోజా మంగళవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని, ఎప్పుడు అవకాశం దొరికినా ఒక మొక్కను నాటాలని కోరారు ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన జోగినపల్లి సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపి యోయో టివి సిఇఓ మల్లా రెడ్డి, ప్రముఖ గాయని ఎంఎం శ్రీ లేఖ, సింగర్ సాకేత్ , చెస్ ఛాంపియన్ హారిక నలుగురికి మొక్కలు నాటాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News