Home జాతీయ వార్తలు హిందూ మహాసభ నాయకుడు కమలేష్ తివారీ హత్య

హిందూ మహాసభ నాయకుడు కమలేష్ తివారీ హత్య

 

లక్నో:  అఖిల భారత హిందూ మహాసభ నాయకుడు కమలేష్ తివారీని శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మహమ్మద్ ప్రవక్తను కించపరిచేవిధంగా వ్యాఖ్యలు చేసి 2015లో తివారీ పత్రికల పతాక శీర్షికలకెక్కారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ముస్లిములు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇదే కేసులో తివారీ అప్పట్లో అరెస్టయ్యారు. బ్రిటిషర్ల పాలనలో హిందూ మతస్తుల హక్కులను పరిరక్షించడానికి ఏర్పడిన హిందూ నేషనలిస్ట్ పార్టీకి అనుబంధంగా హిందూ మహాసభ పనిచేస్తోంది.

 

Hindu Mahasabha leader Kamlesh Tiwari shot down, Tiwari made headlines following his alleged derogatory statements against Prophet Muhammad