Home జాతీయ వార్తలు హిందూ ఖైదీల ఉపవాస దీక్ష

హిందూ ఖైదీల ఉపవాస దీక్ష

Ramadan-ముజఫర్‌నగర్ : రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా యూపీలోని ముజఫర్‌నగర్ జిల్లా జైలులో ముస్లిం ఖైదీలతో కలిసి హిందూ ఖైదీలు రోజా పాటించి మతసామరస్యాన్ని చాటుతున్నారు. సుమారు 1150 మంది ముస్లింలతో కలిసి 65 మంది హిందూ ఖైదీలు రంజాన్ మాసంలో చేసే ఉపవాస దీక్ష చేస్తున్నారు. మంగళవారం నుంచి రంజాన్ నెల ప్రారంభమౌఐన విషయం తెలిసిందే. మొదటి రోజున 65 మంది హిందూ ఖైదీలు కూడా ముస్లిం ఖైదీలతో పాటు రోజా పాటించారని జైలర్ సతీశ్ త్రిపాఠి తెలిపారు. ఖైదీలు రోజా పాటించడం కోసం జైలులో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. దీక్షలో ఉన్న ఖైదీలకు పండ్లు, ఖర్జూరాలు, పాలు, ఇతర పదార్ధాలను అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.