Thursday, April 18, 2024

మసీదు నేలమాళిగలో ఆలయం?

- Advertisement -
- Advertisement -

Hindu temple-like structure found in Mangaloreకర్నాటకలో కొత్త వివాదం

మంగళూరు: కర్నాటకలోని మంగళూరు శివార్లలోని ఒక పురాతన మసీదు కింది భాగంలో హిందూ ఆలయానికి సంబంధించిన కళాకృతులు బయటపడ్డాయి. గురుప్ర తాలూకాలోని మలాలీ మార్కెట్‌లోగల జుమా మసీదులో పునర్నిర్మాణ పనులు జరుగుతుండగా ఏప్రిల్ 21న హిందూ ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఆకృతులు బయటపడ్డాయి. మసీదును ఇప్పటికే కూల్చివేయగా ఇప్పుడు పునర్నిర్మాణ పనులు చేపట్టే సమయంలో ఇవి వెలుగుచూడడం సంచలనం సృష్టించింది. మసీదు నిర్మాణం చేపట్టకముందే ఇక్కడ ఒక ఆలయం ఉండేదని కొన్ని సంస్థలు వాదిస్తున్నాయి. కాగా..ఇందుకు సంబంధించిన వాస్తవాలు కనుగొనేవరకు మసీదు నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ విశ్వ హిందూ పరిహద్ నాయకులు జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇలా ఉండగా&ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో ఇటీవల శివలింగం లభించడంతో వివాదం రాజుకున్న నేపథ్యంలో తాజాగా మంగళూరులో ఈ సంఘటన వెలుగు చూడడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News