Friday, March 29, 2024

అమెజాన్ 75 వేల మంది ఉద్యోగుల నియామకం

- Advertisement -
- Advertisement -

Amazon

 

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా పలు కంపెనీ ఉద్యోగాలకు కోత పెడుతున్న నేపథ్యంలో అమెజాన్ మాత్రం 75 వేల మంది నియమించుకునేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు సోమవారం అమెజాన్ ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తితో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా సహా పలు దేశాల్లో ఆన్‌లైన్ ఆర్డర్లు పెరుగుతున్నాయి. అందువల్ల అమెజాన్ గిడ్డంగుల వద్ద డెలివరీ చేయడానికి, ఇతర అవసరాల కోసం 75 వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని నిర్ణయించినట్టు అమెజాన్.కామ్ వెల్లడించింది. మహామ్మారి కరోనా వైరస్ సంక్షోభం సమయంలో వర్కర్ల వేతనాలను పెంచేందుకు ప్రపంచ వ్యాప్తంగా 500 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది.

 

Hiring 75 thousand employees on Amazon
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News