Saturday, April 20, 2024

ఇది చారిత్రాత్మక నిర్ణయం

- Advertisement -
- Advertisement -

చేనేత కళాకారులకు రూ.2 వేలు, అనుబంధ కార్మికులకు   

వెయ్యి రూపాయల ప్రభుత్వ ప్రత్యక్ష సాయం: ఎంఎల్‌సిఎల్.రమణ

మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్, చేనేత జౌళీ శాఖ మాత్యులు కెటిఆర్ చేనేత కళాకారులకు నేరుగా వారి అకౌంట్లో రెండు వేల రూపాయలు, అనుబంధ కార్మికులకు వెయ్యి రూపాయలు చొప్పున 3000 రూపాయలు ప్రతి నెల తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్ష సహాయాన్ని అందించడం చారిత్రాత్మక నిర్ణయమని మాజీ మంత్రి, ఎంఎల్‌సి ఎల్. రమణ అన్నారు.  దేశంలో ఎక్కడా లేనివిధంగా చేనేత కార్మికుల కోసం ఐదు లక్షల బీమా సౌకర్యం , 25 వేల హెల్త్ ఇన్సూరెన్స్‌ను , నూతనంగా ప్రభుత్వం ప్రవేశపెట్టడం కార్మికులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ఈ పథకాలు ప్రవేశపెట్టినందుకు మాజీ ఎంపి రాపోలు ఆనందభాస్కర్, హ్యాండ్లూమ్ టెక్ట్‌టైల్ కార్పొరేషన్ చైర్మన్ ,మాజీ ఎంఎల్‌ఎ చింత ప్రభాకర్, మాజీ ఎంపి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, పవర్ లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News