Home టెక్ ట్రెండ్స్ మార్కెట్లోకి నోకియా సి3, నోకియా 5.3

మార్కెట్లోకి నోకియా సి3, నోకియా 5.3

Nokia

 

న్యూఢిల్లీ : హెచ్‌ఎండి గ్లోబల్‌కు చెందిన నోకియా దేశీయ మార్కెట్లోకి నాలుగు కొత్త ఫోన్లను విడుదల చేసింది. నోకియా సి 3, నోకియా 5.3, నోకియా 125, నోకియా 150ల వంటి రెండు కొత్త స్మార్ట్ ఫోన్‌లు, రెండు కొత్త ఫీచర్ ఫోన్‌లను ఆవిష్కరించింది. భారతదేశంలో తయారు చేసిన- నోకియా సి3 ప్రపంచవ్యా ప్తంగా ప్రవేశపెట్టింది. అలాగే నోకియా 5.3 ఆకట్టుకునే పనితీరు, మల్టీ క్వాడ్ కెమెరా, రెండు రోజుల బ్యాటరీ లైఫ్, 6.55 స్క్రీన్ ఉన్నాయి. ఫీచర్ ఫోన్‌లు నోకియా 125, నోకియా 150 కొత్త స్థాయిలో దీర్ఘకాలిక బ్యాటరీని కల్గి ఉన్నాయి. ఆగస్టు 25న నోకియా 125, నోకియా 150 విక్రయాలు ప్రారంభమయ్యాయి . ఇక నోకియా 5.3 సెప్టెంబర్ 1 నుంచి రానుంది, అయితే ప్రీ-బుకింగ్ ఆగస్టు 25 నుండి ప్రారంభమైంది. అలాగే నోకియా సి3 17 సెప్టెంబర్ రానుంది, అయితే ప్రీ-బుకింగ్ సెప్టెంబర్ 10 నుండి ఉంటుంది.

HMD Global announced 4 new Nokia phones in India