మన తెలంగాణ / హైదరాబాద్ : ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు సంపాదించిన హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ) ప్లానింగ్ డైరెక్టర్ కె.పురుషోత్తంరెడ్డి అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులకు చిక్కారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా హెచ్‌ఎండిఎ కార్యాలయం, ఆయన ఇల్లు, బం ధువుల ఇళ్లపై జరిగిన సోదాల్లో లెక్కల్లోకి రాని రూ. 5.5 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. దాడులతో హెచ్‌ఎండిఎ అధికారుల్లో కలకలం రేగింది. 1985లో మున్సిపల్ శాఖలో చిరుద్యోగిగా చేరిన పురుషోత్తం హెచ్‌ఎండిఎ ప్లానింగ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. కొంత కాలంగా ఎసిబి అధికారులు నిఘా పెట్టా రు. మూసాపేట్‌లో రూ.3.27 కోట్ల విలువైన ఇంటిని సీజ్ చేశారు. అమీర్‌పేట, గండిపేట, శామీర్‌పేట, బంజారాహిల్స్, శేరిలింగంపల్లి, మూసాపేటలో పారిశ్రామిక షెడ్డు, మియాపూర్, చందానగర్ ప్రాంతాలలో ఉన్న అతనికి, అతని బంధువులకు చెందిన ఇళ్లపై సోదాలు జరిపారు. దాడుల్లో రూ.15 లక్షల నగదు లభించగా, బ్యాంక్‌లో మరో రూ.20 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. రూ.13 లక్షల స్కోడా కారు, రూ.25 లక్షల విలువైన బీమా పత్రాలు, రూ.15.76 లక్షల విలువైన బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. ఇతని బంధువు బి.శ్రీనివాస్‌రెడ్డి పేరుతో ఉన్న బినామి ఆస్తులను ఎసిబి అధికారులు గుర్తించారు. మంచిర్యాలలోని ఆరు ఎకరాల్లో విల్లాల నిర్మాణానికి చేసుకున్న ఒప్పంద పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పురుషోత్తంరెడ్డి ఆస్తులు బహిరంగ మార్కెట్‌లో రూ.30 కోట్లకుపైగా విలువ ఉంటాయి.
ఎసిబి వలలో హెచ్‌ఎండిఎ డైరెక్టర్
- Advertisement -
- Advertisement -