Home రాష్ట్ర వార్తలు హెచ్‌ఎండిఎ ఖాళీలలు

హెచ్‌ఎండిఎ ఖాళీలలు

భర్తీకాని సగం పోస్టులు, అమిత పనిభారంలో సిబ్బంది

hmdaసిటీబ్యూరో : భర్తీ కానీ పోస్టులు… పెరుగుతున్న పనిభారం… వెరసి నష్టపోతున్న ఉద్యోగులు… ఇదీ హైదరా బాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండిఎ) పరిస్థితి. పనిభారం ఒత్తిడితో విధి నిర్వహణలో జాప్యం చేస్తున్న ఓ ప్లానింగ్ అధికారి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఓవైపు ఏకీకృత మాస్టర్‌ప్లాన్, మరో వైపు ఎల్‌ఆర్‌ఎస్, ఇంకోవైపు డిపిఎంఎస్ పనులు ఒకటి మించి మరొటి ముఖ్యమైన పథకాలు అమ లు పరుస్తున్నది హెచ్‌ఎండిఎ. ఈ తరుణంలో ఖాళీ పోస్టులను భర్తీచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఖాళీలను భర్తీ చేయాలని గత సంవత్సరమే పురపాలక శాఖకు కమిషనర్ లేఖ రాయడం జరిగింది. కానీ ఆ విభా గం ఉన్నతస్థాయి అధికారులు సానుకూలంగా లేకపోవడంతో భర్తీ జరగడంలేదు. దీంతో ప్రస్తుత కమిషనర్ చిరంజీవులు ఔట్‌సోర్సింగ్‌లో కొందరి ని తీసుకుని పనిభారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తు న్నారు. ప్రస్తుత ఖాళీలతో ఉన్న ఉద్యోగులపైనే పనిభారం పెరుగుతుంది.
ఖాళీలు 300: ముందు హుడా గా ఉన్నప్పుడు మంజూరైన పోస్టులే ఇప్పటికీ కొన సాగుతున్నాయి. కానీ, హుడా నుండి హెచ్‌ఎండిఎ గా ఆవిర్భవించినా పోస్టులు పెంచకపోవడం ప్రభుత్వ పట్టింపులేని ధోరణిని తేటతెల్లం చేస్తుం ది. మొత్తం మంజూరైన పోస్టులు 600గా ఉండగా ప్రస్తుతం పనిచేస్తుంది మాత్రం 300 అని, ఖాళీగా 300 ఉన్నాయని రికార్డులు వెల్లడిస్తున్నాయి. అంటే సగానికి సగం మంది ఉద్యోగులు పని చేస్తుండగా పనిభారం రెట్టింపుగా ఉన్నది. హెచ్ ఎండిఎలో ప్లానింగ్ విభాగం పాత్రే ప్రధానంగా ఉంటుంది. ప్లానింగ్ విభాగానికి మొత్తం 110 పోస్టులు మంజూరైతే 55 మంది మాత్రమే పనిచే స్తుండగా మిగతా 55 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారులు వెల్లడి స్తున్నారు.
ఏపిఓ సస్పెన్షన్…. ఇండస్ట్రీస్‌కు సంబంధించిన రెండు దరఖాస్తులను పరిష్క రించడంలో మూడు నెలలు జాప్యం చేశాడనే కారణంతో వికాస్ అనే ఏపిఓను ఈ నెల 28న సస్పెన్షన్ చేయడం జరిగింది. హెచ్‌ఎండిఎలో ప్రధానంగా భూ మార్పిడులు, ఇండస్ట్రీల ఏర్పాటుకు అనుమతి మంజూరు చేయడం అధికా రులపై వత్తిడిని పెంచుతాయి. ఈ దరఖాస్తులు సంపన్న వర్గాలు, ఉన్నతస్థా యిలోని వ్యక్తుల సంబంధీకులవే అధికంగా ఉంటాయి. వీటిని పరిష్కరిం చడంలో జాప్యం జరిగితే చాలు ఉన్నతస్థాయిలోని వ్యక్తుల నుండి తీవ్రస్థా యిలో వత్తిడిలు రావడం అథారిటీలో సహజం. అథారిటీ లో ఏకీకృత మాస్టర్‌ప్లాన్, ఎల్‌ఆర్‌ఎస్, డిపిఎంఎస్ పథకాల అమలు జరుగు తున్నది. ఎల్‌ఆర్‌ఎస్‌లో వచ్చిన దరఖాస్తులు 1.19 లక్షలుగా ఉన్నాయి. వీటి పరిష్కారం మార్చినాటికి పూర్తిచేయాలి. కానీ, ఇప్పటి వరకు పరిష్కరించినవి సుమారు 100 మాత్రమే. క్రమబద్దీకరణ దరఖాస్తులు అధికశాతం సామాన్య మధ్యతరగతి వారివే ఉంటాయి. వీటిని గడువులోపు పూర్తిచేయకుంటే అధికా రగనం అదనపు గడువు కావాలంటూ ప్రభుత్వానికి లేఖ రాయడం జరుగు తుంది. కానీ ఎందుకు పరిమిత కాలంలో పూర్తిచేయలేపోయారనేదానికి జవా బు దొరకదు. అదే… ఇండస్ట్రీస్ నుండి వచ్చిన దరఖాస్తును మూడు మాసా ల్లోగా పరిష్కరించని పక్షంలో సంబంధిత అధికారిపై విభాగమైన చర్యలు తీసుకోవడమంటే వివక్ష చూపడమేనని ఉద్యోగులు వాఖ్యానిస్తున్నారు. ఒక ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తును ప్లానింగ్‌లో కిందిస్థాయిలో పరిష్కార ప్రక్రియను రెం డు రోజుల్లో పూర్తిచేస్తే డైరెక్టర్ స్థాయిలోని అధికారి 11 రోజులు తన వద్దనే పెట్టుకుంటే విభాగపరమైన చర్యలుండవు. ఇదీ హెచ్‌ఎండిఎ తీరు.