Friday, April 19, 2024

‘లైగర్’ కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్

- Advertisement -
- Advertisement -

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రూపొందుతున్న స్పోర్ట్ డ్రామా ‘లైగర్’. ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనేది దీనికి ట్యాగ్ లైన్. ఈ పాన్ ఇండియా సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. మార్షల్ ఆర్ట్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ మిక్స్‌డ్ మారల్ ఆర్ట్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇప్పటికే ముంబయ్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో లాంగ్ షెడ్యూల్ పూర్తి చేశారు. పూరీ ఈ చిత్రాన్ని హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నాడు. అందుకే యాక్షన్ సీక్వెన్సెస్ డిజైన్ చేయడం కోసం ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్‌ని ‘లైగర్’ కోసం తీసుకొచ్చారు. జాకీచాన్ సినిమాలతో పాటు పలు హాలీవుడ్ చిత్రాలకు వర్క్ చేసిన ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.

ఇప్పటికే ఆండీ ఆధ్వర్యంలో పలువురు విదేశీ ఫైటర్స్‌తో కలిసి విజయ్ యాక్షన్ ఎపిసోడ్స్ చేసినట్లు తెలిసింది. ఇందులో విజయ్ పొడవాటి జుట్టుతో మాస్ లుక్‌లో విభిన్నంగా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘లైగర్’ ఫస్ట్ లుక్ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. పూరీ కనెక్ట్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్ కలిసి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 9న ‘లైగర్’ను విడుదల చేయనున్నారు.

Hollywood Stunt director for ‘Liger’ Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News