Home రాజన్న సిరిసిల్ల మనస్తాపంతో హోంగార్డు ఆత్మహత్య

మనస్తాపంతో హోంగార్డు ఆత్మహత్య

                 Suicide

ఇల్లంతకుంట: కుటుంబ కలహాలతో హోంగార్డు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన అనుముల సంతోష్ ఇల్లంతకుంట మండలం పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల బదిలీ కావడంతో సంతోష్ భార్య పద్మ, పిల్లలతో కలిసి ఇల్లంతకుంటకు వచ్చాడు. కాగా, కొన్ని రోజులుగా దంపతుల నడుమ గొడవలు జరగడంతో పద్మ 20రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన సంతోష్ ఇల్లంతకుంటలోని తన నివాసంతో శుక్రువారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న సిరిసిల్ల రూరల్ సిఐ శ్రీధర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తెలిపారు.