Tuesday, January 31, 2023

హోంగార్డుల వేతనం రూ.15 వేలు?

- Advertisement -

home-guardsహైదరాబాద్ : పోలీసులతో సమానంగా తమకు వేతనాలు, సౌకర్యాలను కల్పించాలంటూ కొన్నాళ్ళుగా పోరాటం చేస్తున్న హోంగార్డులకు ప్రభుత్వం త్వరలోనే శుభవార్త అందించనుంది. సమాన పనికి సమాన వేతనం అన్నది వారి చిరకాల కోరిక.హోంగార్డుల పోరాటాలకు పార్టీలు, ప్రజా సంఘాలు కూడా సంఘీ భావం తెలి పాయి. హోంగా ర్డుల సమస్యలపై డిజిపి అను రాగ్‌శర్మ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపు తూనే ఉన్నారు. పోరాటం, సంప్రదింపుల నేప థ్యంలో ప్రభుత్వం పలు ప్రధాన డిమాండ్లపై కొంత సాను కూలంగా స్పందించింది. హోం గార్డుల వేత నాన్ని రూ. 12 వేల నుంచి రూ. 15 వేలకు పెం చడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గులకు ఇస్తున్న హెల్త్ కార్డులను వర్తింప చేయా లని తల పెట్టింది. అదే విధంగా వారం తాపు సెలవులకు అర్హులను చేయనున్నారు.
రాష్ట్రంలో దాదాపు 50 వేల మంది పోలీసులు పని చేస్తుం డగా 20 వేల మంది హోంగార్డులు తోడుగా సేవలను అందిస్తు న్నారు. వీరిలో కొంత మంది డ్రైవర్లుగా, మరి కొంత కంప్యూటర్ ఆపరేటర్లుగా, ఇంకొంత మంది శాంతిభద్రతలు, ట్రాఫిక్, క్రైం తదితర విభాగాలలో సేవలను అందిస్తు న్నారు. పోలీ సుల మాదిరిగానే విధి నిర్వహణలో బాధ్యతతో పని చేస్తున్నప్పటికీ చాలా చోట్ల వీరికి అధికారుల నుంచి చీదరింపులు ఎదురవుతు న్నాయి. అన్నిం టికంటే ప్రధానంగా వేతనంలో భారీ వ్యత్యాసం ఉంది. దీనిపై కొంత కాలంగా ఆఁదోళన సాగుతుంది. రెండు మాసాల క్రితం సచివాలయ ముట్టడికి హోంగార్డులు చేసిన ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కొంత మందిపై వేటు వేశారు. దీంతో రాజకీయ పార్టీలు, ప్రజా సం ఘాలు వారికి బాసటగా నిలిచి ప్రభుత్వంపై వత్తిడిని తీవ్రం చేశాయి. నాలుగు రోజుల క్రితం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిజిపి అనురాగ్‌శర్మ సిఎం కెసిఆర్‌తో చర్చించగా వేతన పెంపు, హెల్త్ కార్డుల జారీ, వారాంతపు సెలవు తదితర ప్రధాన డిమాండ్లను అంగీకరించారు. త్వరలోనే హోంగార్డులకు శుభవార్తను అందిద్దా మని వారికి సిఎం కెసిఆర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles