Wednesday, April 24, 2024

తీరుమారకపోతే మరిన్ని మెరుపుదాడులే

- Advertisement -
- Advertisement -
Home Minister Amit Shah warns Pakistan
పాకిస్థాన్‌కు అమిత్ షా ఘాటు హెచ్చరిక
చర్చల కాలం చెల్లిపోయింది
ఇక దెబ్బకు దెబ్బనే భారత్ దారి

పనాజీ : ఇప్పటికైనా వక్రబుద్దిని వీడకపోతే మరిన్ని సర్జికల్ దాడులకు దిగుతామని పాకిస్థాన్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రంగా హెచ్చరించారు. చర్చల రోజులు పొయ్యాయి. ఇప్పుడు ఇక దెబ్బకు దెబ్బతీసే కాలం వచ్చిందని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ తన అతిక్రమణలు , సీమాంతర ఉగ్రవాదానికి వెన్నుదన్నులు నిలిపివేయాలి. కశ్మీర్‌లోని అమాయక పౌరుల వధకు దిగుతున్న వారిని వెనుకేసుకురావడం మానుకోవాలి. ఈ పద్ధతి వీడకుండా ఇదే ధోరణిని సాగిస్తే భారత్ చూస్తూ ఊరుకోదు, ఏరివేతలకు మరిన్ని మెరుపుదాడులకు దిగుందని తీవ్రపదజాలంలో హెచ్చరించారు. గోవాలోని ధర్బందోరాలోని అత్యంత కీలకమైన నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీకి శంకుస్థాపన చేస్తూ అమిత్ షా మాట్లాడారు. ఇంతకు ముందు జరిపిన సర్జికల్ దాడుల దెబ్బల అనుభవం పాకిస్థాన్‌కు ఇప్పటికీ ఉండే ఉంటుందని, దీనిని గుర్తుంచుకుని అయినా అక్రమంగా ఉగ్రవాదులను సరిహద్దులు దాటించే యత్నాలు మానుకోవాలని షా తెలిపారు.

భారత్ శాంతియుతంగానే ఉంటుంది. అయితే ఎటువంటి దాడులు జరిగినా సహించబోదు అనేది ఇంతకు ముందటి సర్జికల్ స్ట్రైక్స్‌తో తెలిసి ఉంటాయని షా చెప్పారు. ప్రధాని మోడీ, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సారథ్యంలో జరిగిన సర్జికల్ దాడులతో పాకిస్థాన్‌కు భారత్ ఇప్పటికే కీలక సందేశం వెలువరించింది. సరిహద్దులను దాటివస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని ఈ ఘటనతో రుజువు చేశామని , భారత సరిహద్దులను ఏ శక్తి అస్థిరపర్చలేదని స్పష్టం చేవారు. ఇంతకు ముందు కాలం వేరు చర్చల కాలం అది. అయితే ఇప్పుడు దశ మారింది. చర్యకు ప్రతిచర్యనే దైనందిన పరిణామం అయిందన్నారు. భారత్‌లోని యూరి, పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్‌లలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులు 2016 సెప్టెంబర్‌లో జరిగాయి.

ఇందుకు తగు జవాబుగా భారత్ మెరుపుదాడులను 11 రోజుల వ్యవధిలోనే భీకర స్థాయిలో జరిపిది. ఈ క్రమంలో పాక్ భూభాగంలోని టెర్రరిస్టుల క్యాంప్‌లను దెబ్బతీసింది. అప్పటి పరిణామాలను పాకిస్థాన్ ఇప్పుడు గుర్తు పెట్టుకుని వ్యవహరించాల్సి ఉంది. లేదని ఆక్రమణల పర్వానికి, అతిక్రమణకు దిగితే సర్జికల్ దాడుల ఫలితాలు మరోసారి చవిచూడాల్సి ఉంటుందని అమిత్ షా స్పష్టం చేశారు. గోవా ప్రజలు అభివృద్ధిని, సుస్థిరతను కోరుకుంటున్నారని ఈ క్రమంలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి పూర్తిస్థాయి మెజార్టీతో తిరిగి అధికారం దక్కించుకుంటుందని అమిత్ షా స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News