Thursday, April 25, 2024

తెలంగాణలో మహిళల భద్రతకు పెద్దపీట

- Advertisement -
- Advertisement -

Home Minister Mahmood Ali Inaugurate Bharosa Centre

సరూర్‌నగర్‌లో భరోసా సెంటర్ ప్రారంభం
33 షీటీమ్స్ పనిచేస్తున్నాయి
అభివృద్ధిలో శాంతిభద్రత పాత్ర కీలకం
హోంమంత్రి మహమూద్‌అలీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళ భద్రతకు పెద్దపీట వేస్తోందని ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి మహమూద్‌అలీ అన్నారు. రాచకొండ పోలీసులు సరూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, దయానంద్, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన దామోదర్, డిజిపి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్‌అలీ మాట్లాడుతూ మహిళల భద్రత కోసం 33 షీటీమ్స్ నిరంతరాయంగా పనిచేస్తున్నాయని తెలిపారు. సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉమెన్, పిల్లల భద్రత కోసం సహకరిస్తామని తెలిపారు.

దేశంలో ఉన్న సిసి కెమెరాల్లో 64శాతం మూడు పోలీస్ కమిషనరేట్లలో ఉన్నాయని తెలిపారు. కమ్యూనిటీ సిసిటివిల ఏర్పాటుతో కేసులను త్వరితగతిన పూర్తి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ పోలీసులు సామాన్యులకు ఉన్న భయాన్ని ఫ్రెండ్లీ పోలిసింగ్ ద్వారా తొలగించారని తెలిపారు. సమస్యల పరిష్కారంలో ఫ్రెండ్లీ పోలిసింగ్ చాలా సహకరిస్తోందని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో శాంతిభద్రతలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. తెంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వాహనాల పెట్రోలింగ్‌కు రూ.700 కోట్లు కేటాయించిందని అన్నారు. వీటి ద్వారా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ నేరాలు జరగకుండా చూస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో రాచకొండ అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, డిసిపిలు సన్‌ప్రీత్‌సింగ్, రక్షితమూర్తి, నారాయణరెడ్డి, ఎస్‌కె సలీమ, శిల్పవళ్లి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల భద్రతలో తెలంగాణ పోలీసులు ముందజః మహేందర్ రెడ్డి, డిజిపి

తెలంగాణ ప్రజల భద్రతలో పోలీసులు ముందు ఉన్నారని రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి అన్నారు. ప్రజల భద్రత కోసం పోలీసులు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారని తెలిపారు. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్, భరోసా సెంటర్లు నిర్భయా ఫండ్ స్కీం కింద, సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర హోం ఖాఖ ఉమెన్, పిల్లల భద్రత కోసం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. నేరస్థులను పట్టుకోవడంలో సిసిటివిలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రజలు, రాజకీయ నాయకుల సహకారంతో తెలంగాణ వ్యాప్తంగా 8.5లక్షల సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సిసి కెమెరాలు ఏర్పాటు చేసేందుకు నిధులు ఇచ్చారని తెలిపారు.

మహిళల భద్రత కోసం కృషి చేస్తున్నాంః మహేష్ భగవత్, రాచకొండ పోలీస్ కమిషనర్

పబ్లిక్ ప్లేసుల్లో మహిళలు, పిల్లలు సురక్షితంగా ఉండేందుకు కృషి చేస్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా 30 సిడిఈడబ్లూలు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో రాచకొండకు ఏడు కేటాయించారని తెలిపారు. ప్రతి పోలీస్ కమిషనరేట్‌లో ఒకటి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గృహహింసను ఎదుర్కొంటున్న బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కౌన్సెలింగ్ ఇచ్చేందుకు కౌన్సిలర్లను, సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. భరోసా సెంటర్‌లో సత్వర న్యాయం చేసే కేసులు, ఆన్‌లైన్ ద్వారా స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తున్నామని తెలిపారు. మహిళలు, పిల్లలు వారిపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. భరోసా కేంద్రాన్ని రూ.1.75 కోట్లతో నిర్మించామని తెలిపారు.

Home Minister Mahmood Ali Inaugurate Bharosa Centre

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News