Home తాజా వార్తలు రైతుల మేలుకోసమే కెసిఆర్ కృషి:నాయిని

రైతుల మేలుకోసమే కెసిఆర్ కృషి:నాయిని

naini

నల్లగొండ: అభివృద్ది పథకాలే టిఆర్‌ఎస్ పార్టీని గెలిపిస్తాయని రాష్ట్ర హోం మంత్రి నాయని నర్సింహ్మరెడ్డి అన్నారు. శుక్రవారం దేవరకొండలోని జడ్ పిటిసి ఆలంపల్లి నర్సింహ్మ గృహంలో విలేకరులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలుచేసిన ఘనత సిఎం కెసిఆర్‌దేనన్నారు. మ్యానిఫెస్టోలో లేని అనేక పథకాలను ప్రవేశపెట్టారని, తెలంగాణలో రైతాంగ అప్పులు తీసుకునే స్థాయి నుంచి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగాలనే కోరికతో సిఎం పనిచేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయడం దేశంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే చెల్లిందనన్నారు.  గత ప్రభుత్వాలు తెలంగాణను పట్టించుకోకపోవడంతో పాటు ఎప్పుడు తమ పదవులకు ప్రాధాన్యత నిస్తు కాలం గడపారని విమర్శించారు. ప్రజలు మళ్లీ టిఆర్‌ఎస్ పార్టీని గెలిపించుకుని రాష్ట్ర అభివృద్దిలో తోడ్పడాలని కోరారు. ఎన్నికలల్లో ఇచ్చిన హామీలను నూరు శాతం అమలు చేసిన ఘనత కెసిఆర్‌కే దక్కిందన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రికి మరో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలందరు సహకరించి దేవరకొండ నియోజకవర్గ అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్‌ను గెలిపించాలని అన్నారు. సాగుకు నిరంతరం విద్యుత్, రైతుబంధు, రైతుభీమా పథకాలు అన్నదాత జీవితాల్లో వెలుగు నింపాయని పేర్కోన్నారు. రైతాంగం కెసిఆర్‌కు జై కొడుతున్నారన్నారు. రైతాంగం మరోసారి కెసిఆర్ సిఎం కావాలని బలంగా ఆకాంక్షిస్తుందని చెప్పారు.దేవరకొండ నియోజకవర్గ అభ్యర్ధి రవీంద్రకుమార్‌ను 50 వేల మోజర్టీతో గెలిపించాలని నియోజకవర్గ కార్యకర్తలు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను ఆపాలనే ఉద్దేశ్యంతోనే సిఎం కెసిఆర్ నిరంతరంగా కృషి చేస్తున్నారన్నారు. రైతుబంధు ద్వారా రైతులకు ఎకరానికి రూ. 8 వేల చోప్పున రూ 12 వేల కోట్లు కెటాయించారని అన్నారు. ప్రజలందరికి అభివృద్ది, సంక్షేమ ఫలాలు అందాలంటే టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక రిజర్వాయర్‌లు నిర్మాణంలో ఉన్న నియోజకవర్గం దేవరకొండనేనని, రాబోయే 2 సంవత్సరాలల్లో దేవరకొండ నియోజకవర్గం సశ్యామలవుతుందన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో అక్టోబర్ 4వ తేదిన నిర్వహిచనున్న ప్రజా ఆశీర్వాద సభకు దేవరకొండ నియోజకవర్గం నుండి భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని నాయిని నర్సింహారడ్డి కోరారు.

Home minister Naini Narsimha reddy press meet