Home తాజా వార్తలు యుపి ఎన్నికల్లో మాదే విజయం: రాజ్‌నాథ్

యుపి ఎన్నికల్లో మాదే విజయం: రాజ్‌నాథ్

RAJNATH

న్యూఢిల్లీ: 2017 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి స్వీప్ చేయడం ఖాయమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. శనివారం ఆయన లఖన్‌పూర్‌లో పరివర్తన్ ర్యాలీ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. వచ్చే యుపి ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

బిజెపి పరివర్తన్ ర్యాలీ యుపి అభివృద్ధికి ఎంతో సహకరిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా నోట్ల రద్దు అంశం ప్రస్తావనకు రాగా… ఎన్నికల్లో గెలుపు ఓటములపై ఈ అంశం ఏమాత్రం ప్రభావం చూపదని వెల్లడించారు. ఇది కేవలం నల్లధనం, అవినీతి నిర్మూలనతో దేశానికి ప్రయోజనం కలిగించడం కోసం తీసుకున్న నిర్ణయంగా ఆయన పేర్కొన్నారు.