Friday, March 29, 2024

ఫ్రెండ్లీ పోలిసింగ్…  వైద్యురాలితో అసభ్యంగా ప్రవర్తించిన హోంగార్డు

- Advertisement -
- Advertisement -

Homeguard who was vulgar with Doctor

 

గతంలో డయల్ 100కు చెసినందుకు చితకబాదారు
కొందరి వల్ల నీరుగారుతున్న ఆశయం

మనతెలంగాణ, హైదరాబాద్ : తెలంగాణ పోలీసులు అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోసింగ్‌కు కొందరి ప్రవర్తన వల్ల విఘాతం కలుగుతోంది. సామాన్యుడి ఉంచి విఐపి వరకు ప్రతి ఒక్కరిని గౌరవించాలని పోలీస్ బాస్ ఆదేశాలు జారీ చేసినా కూడా కొందరి వల్ల చెడ్డ పేరు వస్తోంది. లాక్‌డౌన్ విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు ఇంర్న్‌షిప్ చేస్తున్న వైద్యురాలిని వేధించడంతో మరోసారి వెలుగులోకి వచ్చింది. ముషీరాబాద్ చెక్‌పోస్టు వద్ద రాత్రి సమయంలో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ హోంగార్డు వెంకటేష్ విధులు ముగించుకుని వస్తున్న వైద్యురాలి వివరాలు తెలుసుకున్నాడు.

రాత్రి సమయంలో తెలంగాణ వ్యాప్తంగా కర్ఫూ అమలు కావడంతో రోడ్లపైకి వచ్చే వారిని ఆపి ఫోన్ నంబర్, అడ్రస్ తదితర వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వైద్యురాలి వివరాలు తెలుసుకున్న హోంగార్డు కొద్ది రోజుల తర్వాత అసభ్య మెసేజ్‌లు పంపించడం ప్రారంభించాడు. రోజు రోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేక వైద్యురాలు నగర పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే చర్యలు తీసుకున్నారు. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కూడా పలువురు పోలీసులు ప్రజల పట్ల అసభ్యంగా ప్రవర్తించగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఫ్రెండ్లీ పోలిసింగ్ అమలులో ఉన్నా కూడా కొందరు విచక్షణ రహితంగా చితకబాదడంతో పలు విమర్శలు వచ్చాయి. దీంతో వారిపై చర్యలు పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

డయల్ 100పై….

డయల్ 100కు ఫోన్ చేస్తే చాలు పోలీసులు నిమిషాల్లో వచ్చి కాపాడుతారని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నా ఆచరణలో మాత్రం కన్పించడంలేదు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో డయల్ 100కు ఫోన్ చేయగా కానిస్టేబుల్ వచ్చి భూతులు తిట్టడమే కాకుండా పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి చితకబాదారు. ఈ కేసులో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ వెంటనే స్పందించి బాధితుడికి న్యాయం చేశారు. ఇన్స్‌స్పెక్టర్‌ను బదిలీ చేయడంతోపాటు, కానిస్టేబుల్‌ను సస్పెన్షన్ చేశాడు. ఈ విధంగా పలు సందర్భల్లో కూడా డయల్ 100కు ఫోన్ చేసిన వారిపట్ల అమర్యాదగ ప్రవర్తించడం జరిగింది. కొంత మంది అధికారుల పనుల వల్ల ఫ్రెండ్లీ పోలిసింగ్‌కు తరచూ అంతరాయం కలుగుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News