Home తాజా వార్తలు ఇంట్లోనే తయారు చేసుకుందాం

ఇంట్లోనే తయారు చేసుకుందాం

Lips

 

శీతాకాలంలో పెదవుల పట్ల కాస్త ఎక్కువగానే జాగ్రత్త వహించాలి. ఇందుకు రసాయనాలతో నిండిన లిప్‌బామ్, జెల్‌ల వంటివి వాడాల్సిన అవసరంలేదు. ఇంట్లోనే తయారు చేసుకుని వాడుకోవచ్చు. తేనె, కొబ్బరి నూనె – ఒక్కో స్పూన్, బ్రౌన్ షుగర్ – అర టీస్పూన్ తీసుకోవాలి. ఈ మూడింటిని ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులపై పూసి నెమ్మదిగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల పెదవులపై ఉన్న మృత చర్మం తొలగిపోయి పెదవులు మృదువుగా తయారవుతాయి.

వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్, ఫ్యాటీ యాసిడ్స్ వల్ల పెదవులకి పోషణ అందుతుంది. ఇది మంచి బైండర్(బంధకం) కూడా. పెదవులపై ఉండే ప్రతీకణాన్ని, త్వచాన్ని బాగా బైండ్ చేస్తుంది. అదీకాకుండా ఇంట్లో తయారుచేసుకున్న స్క్రబ్ కావడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. దీన్ని ఎవరైనా వాడొచ్చు. ఇదేకాకుండా మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవచ్చు. అవి…

1. ఒక గిన్నెలో తేనె, కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం స్క్రబ్ బేస్‌గా ఉపయోగపడుతుంది.
2. అర టీస్పూన్ బ్రౌన్ షుగర్‌ను పెదవులపై రాసి నెమ్మదిగా రుద్దాలి. మృతచర్మం ఊడిపోయి పెదవులు మృదువుగా తయారవుతాయి.
3. పెదవులకు తేమ అందించేందుకు కొబ్బరినూనె, తేనెల మిశ్రమం బాగా పనిచేస్తుంది. శీతాకాలంలో పెదవులు పొడిబారడం సహజం. ఈ మిశ్రమం వాడడం వల్ల పెదవులు ఆరోగ్యంగా ఉంటాయి. అందంగా కనిపిస్తాయి. శీతాకాలంలో పెదవుల పట్ల కాస్త ఎక్కువగానే జాగ్రత్త వహించాలి. ఇందుకు రసాయనాలతో నిండిన లిప్‌బామ్, జెల్‌ల వంటివి వాడాల్సిన అవసరంలేదు. ఇంట్లోనే తయారుచేసుకుని వాడుకోవచ్చు.

Homemade tips for lips