Home జాతీయ వార్తలు రాజ్య‌స‌భలో ఆమోదం పొందిన హోమియోప‌తి బిల్లు

రాజ్య‌స‌భలో ఆమోదం పొందిన హోమియోప‌తి బిల్లు

Union Minister Harsha Vardhanఢిల్లీ : హోమియోప‌తి సెంట్ర‌ల్ కౌన్సిల్ స‌వ‌ర‌ణ‌ బిల్లు శుక్రవారం  రాజ్య‌స‌భలో ఆమోదం పొందింది. కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ బిల్లును స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఈ బిల్లుపై సభలో సుధీర్ఘ చర్చ జరిగింది. ఈ బిల్లు లాభనష్టాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హర్షవర్థన్ సమాధానం ఇచ్చారు. అనంతరం ఈ బిల్లును సభ్యులు ఆమోదిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. 2019 జూన్ లో లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదించిన సభ్యులకు మంత్రి హర్షవర్థన్ ధన్యవాదాలు తెలిపారు.