Home నాగర్ కర్నూల్ గిరుజనులకే గీటు తేనె పట్టు

గిరుజనులకే గీటు తేనె పట్టు

Honey

మన్ననూర్: తరతరాలుగా చెంచుల సాంప్రదాయంగా వస్తున్న తేనె పట్టు కళ వృత్తిగా నేటికి ఆచర ణ లో అమలౌతుంది. జిల్లాలోనే చెంచులు అధికంగా ఉన్న ప్రాంతం అంటే నల్లమల్ల ప్రాంతం అని చెప్పు కోవచ్చు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్న చెంచులు సేకరిస్తున్న ఫలసాయంలో అతి ముఖ్య మైనది తేనె సేకరణ. ఏడాధిలో డిసెంబర్,జనవరి,పిబ్రవరితో పాటూ మే,జూన్,జులై,ఆగస్ట్ మాసాల లో మాత్రమే ఈ తేనె సేకరణ విరివిరిగా ఉంటుంది. పొద్దు తిరుగుడు, కంది పూల నుండి కూడా తేనె టీగ లు మకరందాన్ని సేకరిస్తాయి.

తాటి పూలతో వచ్చే తేనె కొం త అరుదుగా దొరుకుతుంది. చెంచులకు ముఖ్య జీవనాధారమైన తేనె సేకరణ పెంపొం దించే దిశగా వివిధ స్వఛ్చంధ సంస్థలు చెంచులకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నరు. దీనిలో భాగంగా గత 6 ఏళ్లుగా కోనేరు స్వఛ్చంధ సంస్థ అచ్చంపేట నియోజక వర్గంలో అమ్రిబాద్, అచ్చంపే ట, బల్మూర్, లింగాల మండలాలతో పాటు కొల్లాపూర్ పెద్దకొత్త పల్లి మండలాలో అనేక మంది చెంచులకు నాస్త్రీయ పద్దతిలో తేనె సేకరణతో వచ్చే లాభాలు తెలియజేయడం జరి గింది.అదేవిధంగా తేన సేకరణ సమయం లో తీసుకోవలిసిన జాగ్రతలతో పాటూ వారికి అవసరమైన కిట్లను( తేనె తీయడానికి ఉపయో గించేవి) అందజేశారు. చెంచులు చూడటానికి నీరసంగా ఉన్నపట్టికి తేనె సేకరణ సమయంలో కొండలు,చెట్లు సునాయసంగా ఎక్కగలుగుతారు.

గతంలో తేనె సేకరణ

Honey4తేనె సేకరణకు వెళ్లె సమయంలో తప్పనిసరి ప్రకృతి, వనదేవతలను అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తుం డేవారు. అనంతరం తేనె తెట్టె కింది భాగంలో ఆకులు, పుల్లలతో దట్టమైన పొగ పెట్టేవారు. దీంతో తేనె టీగలు ఉపిరాడక కొన్ని చనిపోవడంతో పాటు మరికొన్ని అక్కడి నుండి బ్రతుకు జీవుడా అంటూ లేచి వెల్లి పోయోవవి. అప్పుడు అక్కడున్న తేనెను సునాయసంగా తీసుకునే వారు.

కొండ భాగంలో తేనె సేకరణ

కొండ భాగంలో ఉన్న తేనె సేకరించే సమయంలో కులాచారం ప్రకారం కొండపై నుండి జూలువారే తాడు ను ఇప్పటికి బావ మర్ధిని మాత్రమే పట్టుకోనిస్తారు. తాడు సహాయంతో తేనె తెట్టె వద్దకు దిగివచ్చే సమయంలో ఓ ప్రత్యేకమైన మాటలతో శబ్ధం చేస్తు వెంట తెచ్చుకున్న సుడేను అంటు పెట్టి పోగు చేసి తేనెటీగలను తేనెపట్టుకు దూరం చేస్తారు.అనంతరం వెంట తెచ్చుకున్న తేనె శిబ్భెంలో (పల్లెం) తేనె ఉన్న భాగాన్ని వేసుకుని కింద ఉన్న అతనికి చేరవేస్తారు.

తేనె తెట్ట నుండి తేనెను వేరు చేయడం

తెట్టెగా ఉన్న తేనె గడ్డలను పలుచని తెల్లగడ్డలో వేసి జల్లడలాంటి ఓ ప్రత్యేక పాత్రలో పిడు తా రు. తర్వాత వాటిని సీసాలు, డబ్బాల్లో నింపి గిరిజన సహకార సంస్థలో విక్రయించి వారికి అవసరమైన నిత్యవసర సరుకులు కొనుకుంటారు.

శాస్త్రీయ పద్దతిలో తేనె సేకరణ

తేనె టీగలు నశించి పోకుండా చూడటమే కాక, ఒకే తేనె తెట్టె నుండి 5-6 సార్లు తేనె సేక రించే అవకాశం శాస్త్రీయ పద్దతి ద్వారా అంకాశం ఉంటుంది. ఆ ప్రాంతంలో 6 ఏళ్లపాటు చెంచులతో మమేకమై శిక్షణ ఇచ్చిన సంస్థలు ప్రాక్టికల్‌గా రుజువు చేసి చూపించినట్లు చెంచులు అంటున్నారు.

తేనె సేకరణలో పాటించాల్సిన జాగ్రత్తలు

ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇప్పటికే ఆయా స్వఛ్చంద సంస్థలు అందజేసిన కిట్లు ప్రతి గ్రా మం, పెంట, గూడెంలలో చెంచులకు అందుబాటులో ఉన్నయి. వాటి ద్వారా సీజను వారిగా తేనె సేకరి స్తున్నారు. తేనె సేకరణకు సంభందించిన కిట్టులో బలమైన రెండు తాడులు, ఎలి మెంట్, గ్లైజెస్, బూ ట్లు, తెల్లని ప్యాంట్, షర్టు, బకెట్, కత్తి ఉంటుంది

తేనె సేవించే మైనం ఆరోగ్యానికి మంచిది

కొన్ని ప్రాంతల్లో సేకరించిన తేనెను చేతులతో పిండి తేనెను వేరు చేస్తారు. ఇది చూడటానికి అంత మం చిదిగా ఉం డన్నప్పటికి అందులో వచ్చే వైనం ఆరోగ్యానికి మంచిదని అంటారు.

ప్రతి ఒక్కరుకి ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించాలి

గత కొన్ని ఏళ్లుగా స్వచ్చంధ సంస్థలు మాత్రమే తేనె సేకరణలో చెంచులకు ఉపయోగకరంగా ఉంటున్నాయి. చెంచులకు జీవనాధారమైన తేనె సేకరణకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉండటంలేంని పలువురు చెంచులు విమర్శిస్తున్నారు. రోజు రోజుకు నశించి పోతున్న తేనె టీగల పెంపకానికి ప్రభుత్వం ప్రత్యమ్నాయ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా జీసీసీలో కొనుగోలు చేసే ధరకంటే బయటి వ్యక్తులకు అమ్ముకుంటే అధికంగా డబ్బులు వస్తున్నాయి. ప్రభుత్వం తేనెకు మద్దతు ధర కల్పించడంతో పాటు తేనె సేకరణకు వెళ్లే ప్రతి ఒక్కరికి ఇన్స్‌రెన్సూ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. – చిగుర్ల పెద్ద ఈదయ్య (ఆగర్ల పెంట)