Friday, March 29, 2024

వినోదాత్మక ‘హనీ ట్రాప్’

- Advertisement -
- Advertisement -

సందేశాత్మక అంశాలను కమర్షియల్ యాంగిల్‌లో తెరకెక్కించే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి. తన పంథాలో ఆయన రూపొందిస్తున్న తాజా చిత్రం ‘హనీ ట్రాప్’. రిషి, శిల్ప నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వివి వామన రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివి వామనరావు ఈ చిత్రానికి నిర్మాతగానే కాకుండా కథా స్క్రీన్ ప్లే అందించి ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. ప్రవీణ్ ఇమ్మడి సంగీతాన్ని అందించిన హనీ ట్రాప్ మూవీ ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, రఘు కుంచె అతిథులుగా పాల్గొని చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ “వామనరావుకు ‘హనీ ట్రాప్’ కథ చెప్పగానే… మూవీకి కావాల్సిన విషయం ఇందులో ఉందనిపించి సినిమాను ప్రారంభించారు. ముందుగా అనుకున్న బడ్జెట్‌కు ఒక్క రూపాయి పెరగకుండా జాగ్రత్త పడుతూ సినిమా షూటింగ్ చేశాం. మా గత హిట్ చిత్రాల్లాగే ‘హనీ ట్రాప్’ తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వివి వామనరావు, యెక్కలి రవీంద్ర బాబు, శివ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News