Home అంతర్జాతీయ వార్తలు హాంకాంగ్‌లో ఆందోళనకారుల విధ్వంసం

హాంకాంగ్‌లో ఆందోళనకారుల విధ్వంసం

Hong Kong

 

హాంకాంగ్ : హాంకాంగ్‌లో బుధవారం ప్రజాస్వామ్య అనుకూల ఆందోళన కారులు ‘బ్లాసమ్ ఎవిరివేర్ ’ అనే నినాదంతో భారీ ఎత్తున ఆందోళన సాగించి విధ్యంసం సృష్టించారు. రహదారులన్నీ దిగ్బంధం చేశారు. స్కూళ్లు, షాపింగ్ మాల్స్ మూసివేయించారు. రైలు సర్వీసులు కూడా అనేక చోట్ల రద్దయ్యాయి. ఇటుకలు, పరుపులు, మంచాలు, సైకిళ్లు రోడ్లపై అడ్డంగా పెట్టి ఎలాంటి రాకపోకలు లేకుండా దిగ్బంధం చేశారు. 7.5 మిలియన్ ప్రజల్లో సగానికి సగం మందికి నిత్యం అవసరమయ్యే సబ్‌వే రైళ్లన్నీ రద్దు చేయించారు.

కార్మికులు, ఉద్యోగులను ఇళ్ల వద్దనే బలవంతంగా ఉంచ గలిగారు. మంగళవారం నుంచి పోలీసుల కాల్పులు, భాష్పవాయు ప్రయోగాలు, రబ్బరు బులెట్లతో రణరంగంలా మారిన యూనివర్శిటీ క్యాంపస్‌లు బుధవారం కూడా ఆందోళనలతో దద్దరిల్లింది. నల్లని దుస్తులు ధరించి ఆందోళనకారులు క్యాంపస్‌లను దిగ్బంధం చేశారు. బ్లాసమ్ ఎవిరివేర్ పేరున చిన్నచిన్న గ్రూపులుగా ఆందోళనకారులు నగరం లోని అనేక ప్రాంతాలను ముట్టడించి ధ్వంసానికి పాల్పడ్డారు. ఈ వారం అంతా సాయంత్రాల్లోనూ, వారాంతపు రోజుల్లోను ఆందోళనలు ఉధృతం చేయడానికి నిర్ణయించారు. సోమవారం నిరాయుధుడైన 21 ఏళ్ల ఆందోళన కారుడిపై పోలీసులు కాల్పులు జరపడంతో ఆందోళన విధ్వంసంగా మారింది.

Hong Kong to close all schools amid escalating protests