Tuesday, March 21, 2023

అమ్మకాల్లో హానర్ 9 లైట్ స్మార్ట్‌ఫోన్ రికార్డు

- Advertisement -

PHM
న్యూఢిల్లీ: హువాయి తాజాగా విడుదల చేసిన హానర్ 9 లైట్ స్మార్ట్‌ఫోన్ హాట్‌కేకులా అమ్ముడుపోయింది. మంగళవారం ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లాష్ సేల్‌లో పెట్టగా 6 నిమిషాల్లో ఫోన్లు అన్నీ అమ్ముడుపోయాయి. అయితే మార్కెట్‌లో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ తమ ఫోన్‌కు వినియోగదారుల నుండి మంచి స్పందన లభించిందని హువాయి కన్జుమర్ బిజినెస్ గ్రూప్ ప్రెసిడెంట్ పి. సంజీవ్ అన్నారు. తక్కువ ధరలో అత్యాధునిక ఫీచర్లు కలిగి ఉండడం ఈ హానర్ 9 లైట్ స్మార్ట్‌ఫోన్ సక్సెస్‌కు కారణమని ఆయన వెల్లడించారు. ముందు, వెనుక డ్యుయల్ కెమెరాలు ఈ ఫోన్‌కు ప్రత్యేకత.

హానర్ 9 లైట్ ఫీచర్స్:-
5.65 అంగులాల డిస్‌ప్లే
కిరిన్ 659 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
3జీబీ ర్యామ్ 32 జీబీజ/256 జీబీ స్టోరెజ్
13 ఎంపీ+2ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా
13 ఎంపీ+2 ఎంపీ డ్యుయల్ ఫ్రంట్ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర రూ.10,999

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News