Home జాతీయ వార్తలు వడ్డీ రేటు తగ్గింపు ఆశలతో బుల్ పరుగు

వడ్డీ రేటు తగ్గింపు ఆశలతో బుల్ పరుగు

bullబడ్జెట్ మరుసటి రోజు
స్టాక్‌మార్కెట్ జోష్
ఏడేళ్లలో ఒక రోజు అతిపెద్ద గెయిన్
777 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
7200 మార్క్‌ను దాటిన నిఫ్టీ
న్యూఢిల్లీ: బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత మరుసటి రోజు బుల్ పరుగులు పెట్టింది. ఆర్‌బిఐ వడ్డీ రేటు తగ్గింపు ఉం టుందనే ఆశలు మార్కెట్‌కు జోష్‌ను ఇచ్చాయి. ఎఫ్‌ఎంసి జి, బ్యాంక్స్, ఐటి, ఆటో రంగ షేర్లు భారీ లాభాలతో దూ సుకెళ్లడంతో సూచీలకు బలం చేకూరి వెనక్కి చూసుకోలే దు. నిఫ్టీ 7200 మార్క్‌ను దాటి ట్రేడ్ అయింది. బిఎస్‌ఇ సెన్సెక్స్ 777 పాయింట్లు లాభపడి 23,779 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 235 పాయింట్లు లాభ పడి 7,222 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఏడేళ్లలో ఒక రో జు అతిపెద్ద గెయిన్ ఇదే. ద్రవ్య లోటు లక్ష్యానికి కట్టుబడి ఉన్నా మని, మూలధన రాబడి పన్ను వ్యవస్థపై ఎలాంటి మరమ్మతు చర్యలు లేకపోవడం, అలాగే బడ్జెట్ ఉత్తమం గా ఉండడంతో మార్కెట్ ర్యాలీ బాటపట్టిందని మార్కెట్ నిపుణులు ఉంటున్నారు. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (పిబిఒసి) నిధులను జొప్పించడం, ఫెడ్, ఇసిబి ముంద స్తు చర్యలు వెరసి అంతర్జాతీయ మార్కెట్లపై ఒత్తిడి నెలకొంది. ఏప్రిల్ 5న సమీక్షలో ఆర్‌బిఐ వడ్డీ రేటును తగ్గించవచ్చేనే ట్రేడర్ల అంచనాలు మార్కెట్‌కు లబ్ధిని చేకూ ర్చాయి. ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబ డి నిర్ణ యాలు తీసుకోవడం, ఇది రేటు తగ్గింపు వల్ల వృద్ధి రేటు కు దోహదం చేయనుందని, విదేశీ పెట్టుబడులకు ఇది ఆశాకిరణంగా మారనుందని ఇన్వెస్టర్లు భావించారు.
బలపడుతున్న రూపాయి
కరెన్సీ విషయానికొస్తే డాలర్‌తో పోలిస్తే రూపాయి బలప డుతోంది. వరుసగా మూడో రోజు లాభపడింది. 40 పైసలు పుంజుకుని 68.02 వద్దకు రూపాయి చేరుకుంది. బ్యాంకులు, ఎగుమతిదారుల నుంచి అమెరికా కరెన్సీ అమ్మకాల ఒత్తిడి పెరిగింది.
క్రూడ్ ఆయిల్ ధరల పతనం
చైనా తయారీ రంగం గణాంకాలు నిరుత్సాహపరచడం తో చమురు ధరలు పతనమయ్యాయి. ప్రపంచంలో రెం డో అతిపెద్ద ఆర్థిక వ్యవస నుంచి చమురుకు డిమాండ్ ఆందోళనలు మరింత పెరిగాయి. దీంతో క్రూడ్ రేట్లు మరింతగా దిగివచ్చాయి.
10 శాతం లాభపడిన ఐటిసి
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యవసాయా నికి అనుకూలంగా ఉండడం, ద్రవ్య లోటు లక్షం 3.5 శాతానికి కట్టుబడి ఉన్నామని చెప్పడం ఇన్వెస్టర్లను ఉత్సాహపరిచింది. ప్రధానంగా ఎఫ్‌ఎంసిజి షేర్లు భారీగా లాభపడ్డాయి. మరోవైపు బిఎస్‌ఇ క్యాపిటల్ గూడ్స్ అలా గే బిఎస్‌ఇ మెటల్ షేర్లు లాభాలతో దూసుకెళ్లాయి. సిగరె ట్లపై 10 శాతం ఎక్సైజ్ సుంకంను ప్రభుత్వం పెంచిన త ర్వాత అంచనాలకు అనుగుణంగా ఉండడంతో షేరు ధర పైపైకి దూసుకుపోయింది. ఈ స్టాక్ దాదాపు 10 శాతం మేర లాభపడింది. ఇన్‌ఫ్రా రంగం కీలకంగా మారింది. 2.2 లక్షల కోట్లు ఈ రంగానికి కేటాయించడం ఆయా షేర్లకు ప్రయోజనంగా మారింది. క్యాపిటల్ గూడ్స్‌తో సహా సిమెంట్ షేర్లు లాభాల బాటలో పయనించాయి. ఎసిసి, అంబుజా సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్స్, శ్రీ సిమెంట్ వంటి సిమెంట్ స్టాక్స్ 1 నుంచి 5 శాతం మేర కు పెరిగాయి. బ్యాంకింగ్‌లో ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యస్ బ్యాంక్, పిఎన్‌బి వంటి షేర్లు 1-8 శాతం మేర లాభపడ్డాయి. ఔషధ కంపెనీ లుపిన్ అనుబంధ సంస్థ క్యోవ జపాన్‌లో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో దేశీయంగా లుపిన్ స్టాక్ విలువ 0.5 శాతం పెరిగింది. ఆటోమొబైల్ కంపెనీలు మంగళవారం నుంచి ఫిబ్రవరి అమ్మకాల గణాంకాల ప్రకటన ప్రారంభిస్తాయి. ఈ రంగం షేర్లు కూడా దాదాపు 20 శాతం మేరకు లాభపడ్డాయి. ప్రభుత్వం గ్రామీణ ఆదాయం, మౌలికా అభివృద్ధిపై దృష్టి పెట్టడం కూడా వాహన రంగానికి అను కూలంగా మారింది. 2016 సంవత్సరానికి మారుతీ సుజుకీ మొత్తం అమ్మకాలు 0.9 శాతం పడిపోయి 117,451 యూనిట్లుగా నమోదైనాయి. జనవరిలో ఈ కంపెనీ 113,606 యూనిట్లను విక్రయించింది. బిఎస్‌ఇ పై ఈ స్టాక్ ధర 9 శాతం పెరిగింది. అశోక్‌లేలాండ్ మూడు శాతం పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లు
ఆసియా షేర్లు లాభాలను నమోదు చేశాయి. చైనా తయా రీ రంగం తగ్గుముఖం పట్టడంతో మరిన్ని చర్యలు చేపట్ట వచ్చని భావిస్తున్నారు. నిక్కీ 225, హ్యాంగ్‌సెంగ్, షాంఘై కాంపోజిట్ 0.4 – 1.6 శాతం మధ్య లాభపడ్డాయి. ఆసి యాలో ర్యాలీ, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, యురో పియన్ ఈక్విటీల లాభాలు వెరసి గ్లోబల్ పాజిటివ్‌గా నడిచింది.