Home జోగులాంబ గద్వాల్ ఉద్యానశాఖ ఆయిల్ ఫామ్ సాగుకు సబ్సిడి: నిరంజన్ రెడ్డి

ఉద్యానశాఖ ఆయిల్ ఫామ్ సాగుకు సబ్సిడి: నిరంజన్ రెడ్డి

Niranjan Reddy

 

జోగులాంబ గద్వాల: బీచుపల్లి ఆయిల్ మిల్లులో ఫామాయిల్ తోటల పెంపకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటాడు. ఈ కార్యక్రమానికి ఎంఎల్ఎలు అబ్రహం, ఆల వెంకటేశ్వరరెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ సరిత జెడ్పి చైర్మన్ లోకనాథ్ రెడ్డి, ఎంఎల్ సి కసిరెడ్డి నారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… వ్యవసాయ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయిస్తుందని, రాష్ట్రంలో ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

70 నుంచి 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అధిక లాభాలు వచ్చే పంటలు రైతులు పండించాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో 206 మండలాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూల వాతావరణం ఉందని, ఉద్యానశాఖ ఆయిల్ ఫామ్ సాగుకు సబ్సిడి అందిస్తుందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వచ్చే నాలుగేళ్లలో  50 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగులోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. బీచుపల్లి ఆయిల్ మిల్ ను త్వరలోనే పునరుద్ధరణ చేస్తున్నట్లుు మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

Horticulture Department subsidy for oil farm cultivation