Tuesday, February 7, 2023

ఎనిమిదేళ్ల బాలుడిపై పెట్రోల్ పోసి నిప్పింటించాడు!

- Advertisement -

Student-Burnt-With-Petrolకృష్ణా : అనాథాశ్రమంలో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన నిర్వాహకుడు రాక్షసుడిలా ప్రవర్తించాడు. తను చెప్పిన మాట వినలేదని ముక్కుపచ్చలారని ఎనిమిదేళ్ల బాలుడిని తీవ్రంగా కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణం కృష్ణా జిల్లాలోని ఎ.కొండూరు మండలం కంభంపాడులోని మదర్ థెరిసా ఆశ్రమంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles