Home Default ఈ చీకటి విడిపోతుంది

ఈ చీకటి విడిపోతుంది

ChandraYaan2

ఈ వైఫల్యంతో కుంగిపోవద్దు, ముందున్న ఉదయాల వైపు, విజయాల వైపు సాగుదాం : ఇస్రో శాస్త్రజ్ఞులను ఊరడించి, భుజం తట్టి ప్రోత్సహించిన ప్రధాని మోడీ

ల్యాండర్ వైఫల్యం తర్వాత చంద్రయాన్-2పై ఇస్రో అధికారిక ప్రకటన

బెంగళూరు : చంద్రుడి వద్దకు సాగిన చంద్రయాన్ యాత్రలో తలెత్తిన ఆటంకానికి కుంగిపోవద్దని ఇస్రో శాస్త్రజ్ఞులకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు ఇచ్చారు. ల్యాండర్ విక్రమ్ వైఫల్యంతో డీలా పడ్డ శాస్త్ర సాంకేతిక బృందాన్ని అనునయించారు. శనివారం ఉదయం తిరిగి ఇస్రో మిషన్ కంట్రోలు సెంటర్ (ఎంసిసి)కి వచ్చి ప్రధాని మోడీ ఉద్విగ్నభరిత ప్రసంగం చేశారు. జాతికి వన్నె తెస్తూ , భారతీయ పతాక రెపరెపలకు అంతర్జాతీయ ఖ్యాతిని తెస్తున్న ఇస్రో సర్వదా అభినందనీయం, జాతికి గర్వకారణం అన్నారు. అయితే ఇప్పటి ఈ విఫలంతో బాధపడవద్దని, దీనిని కొద్ది పాటి చీకటిగా భావించుకోవాలి. నూతన ఉషోదయాలు, ఉజ్వల రేపటి దినం ఉంటుందని గుర్తుంచుకోవాలని ఆయన ఇస్రో సిబ్బందిని ఉద్ధేశించి చెప్పారు.

తెల్లవారు జామున జరిగిన వైఫల్య పరిణామంతో ఇస్రో వర్గాలలో ఒక విధమైన ఆవేదన నెలకొందని తాను గుర్తించానని, అందుకే దీనిని దూరం చేసేందుకు ఇక్కడి వారితో తిరిగి ప్రత్యక్షంగా నేరుగా మాట్లాడేందుకు తిరిగి వీరి మధ్యకు వచ్చానని మోడీ తెలిపారు. మనిషి జీవితంలో అయినా ఏ రంగంలో అయినా వైఫల్యం సహజం. అయితే మరింత రెట్టింపు పట్టుదలతో నిర్ణీత లక్షాన్ని అందుకునే ఆలోచనే కీలకం అని ప్రధాని తెలిపారు. ఘనమైన శాస్త్రీయ విజయాల పట్ల దేశం అంతా ఆశాభావంతో ఉందని, శాస్త్రజ్ఞులకు, సాంకేతిక సిబ్బందికి దేశ ంఅంతా సంఘీభావంగా ఉంటుందని ప్రధాని చెప్పారు. వెలుగు కోసం తపించే అపార విశ్వాసం మనను ఓటమి బాట నుంచి ముందుకు తీసుకువెళ్లుతుందని ప్రధాని తెలిపారు. చంద్రుడు ఊరిస్తూ ఉంటాడు.

చంద్రుడు అందగాడని, చల్లనివెన్నెలలవాడని కవులు చెపుతూ ఉంటారని, ఈ విధంగా మనకు చందమామ ఇప్పటికి అతి తక్కువ దూరంలోకి వచ్చిన తరువాత అందకుండా ఉన్నట్లుగా భావించుకోవాలని, అయితే చందమామ అందుతుందని సభికుల హర్షధ్వానాల మధ్య తెలిపారు. విజయం కోసం విశేష రీతిలో ప్రయత్నించాం. అయితే రాబోయే కాలంలో ఈ దిశలో మరింతగా పాటుపడాలనే విషయం స్పష్టం అయిందన్నారు. నేటి నుంచి పాఠాలను నేర్చుకుని రేపటి ఫలితాలను పొందాల్సి ఉంటుందన్నారు. మన అంతరిక్ష పరిశోధనలు, ప్రణాళికలు, శాస్త్రజ్ఞుల విజయాలతో దేశం గర్విస్తోందని ప్రధాని చెప్పారు. ఇంకా ఏదో అత్యద్భుత విజయం మన అంతరిక్ష పరిశోధనల నుంచి ఆవిష్కృతం కావాల్సి ఉందని, ఈ దిశలో శాస్త్రజ్ఞుల బృందం వైఫల్యాలను విస్మరించి విజయాల కోసం సాగాల్సి ఉందన్నారు. మనం అనంత పయనం సాగించాల్సి ఉంది. విజయయాత్రలకు అంతం లేదని, పయనం బాగా సాగితే ఫలితం కూడా బాగా ఉంటుందని మనను మరింత పటిష్టం చేసి ఉజ్వల భవితకు దారితీస్తుందన్నారు.

మన పరిశోధనలను మరింత విస్తృతపర్చుకోవల్సి ఉందని, సరికొత్త రంగాలను ఎంచుకుని, మరింత సృజనాత్మకతతో అపూర్వ రీతిలో ప్రయోగాలకు రంగం సిద్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇస్రో బృందంలో నెలకొన్న నిర్లిప్తతను తొలిగించేందుకు వారిలో తిరిగి ఉత్సాహం కల్గించేందుకు మోడీ తమ సందేశంతో యత్నించారు. చంద్రుడిని కవులు రమణీయంగా వర్ణించారని, పద్యాలలో దాని గురించి ఎంతగానో పలవరించారని చమత్కరించారు. మనం కూడా ఇప్పుడు చంద్రయాన్‌తో చంద్రుడిని దాదాపుగా ముద్దాడే వరకూ వెళ్లామని, అయితే తీపి అంత తేలిక కాదనేది అయితే మధురఫలం దక్కితీరుతుందని నమ్మకం ఉందన్నారు. ఇస్రో కేంద్రంలో 25 నిమిషాల పాటు మోడీ ఆంగ్లంలో హిందీలో భావోద్వేగ ప్రదర్శితంగా ప్రసంగించారు. చంద్రుడి వద్దకు పోవాలనుకున్నామని అయితే ఇది సాధ్యం కాలేదని, అయితే ఆ తపన మరింతగా రగిలిందని చెప్పారు.

భారత్ మాతాకీ జై అంటూ ఆయన తమ ప్రసంగం ఆరంభించారు. శాస్త్రజ్ఞులను ఉద్ధేశించి ఆయన మాట్లాడుతూ మీ కళ్లే మీలోని ఆవేదనను తెలియచేస్తున్నాయని, దీనిని తాను అర్థం చేసుకోగలనని , తెల్లవారుజామున ప్రయోగ వైఫల్యం దిశలో ఇస్రోలో నెలకొన్న వాతావరణం తనను కదిలించిందని, అందుకే ఎక్కువ సేపు తాను అక్కడ ఉండలేకపోయినట్లు తిరిగి ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్లు వివరించారు.

Hours After Chandrayaan2 Lander Goes Silent