Wednesday, April 24, 2024

హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

House arrest movie pre release event

 

శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, తాగుబోతు రమేష్, అదుర్స్ రఘు ప్రధాన పాత్రదారులుగా ప్రైమ్ షోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకత్వంలో కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘హౌస్ అరెస్ట్’. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకులు చంద్రమహేష్, మధుర శ్రీధర్ రెడ్డి, నిర్మాత అశోక్ రెడ్డి, చిత్ర దర్శకుడు శేఖర్ రెడ్డి, అనూప్ రూబెన్స్, చంద్రబోస్, నటులు శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, తాగుబోతు రమేష్, డీవోపీ యువరాజ్, కళాదర్శకుడు శేఖర్, వేణుమాధవ్ పెద్ది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ “సినిమా టీజర్ చాలా బాగుంది.

శేఖర్ సూపర్బ్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కమేడియెన్స్ అందరూ ఈ చిత్రంలో నటించడం సినిమాకి బిగ్ ఎస్సెట్. ‘హౌస్ అరెస్ట్’ బిగ్ హిట్ కావాలి”అని అన్నారు. చిత్ర దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్ర మాట్లాడుతూ “పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ చిత్రం ప్రారంభం నుండి చివరి వరకూ నవ్వులు ఉంటాయి. హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. యువరాజ్ బ్యూటిఫుల్ విజువల్స్, అనూప్ ఎక్స్‌లెంట్ మ్యూజిక్ ఇచ్చారు. చంద్రబోస్ అద్భుతమైన పాటలు రాశారు”అని తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ “ఒక హౌస్ సెట్ వేసి దాదాపు షూటింగ్ అంతా అందులోనే చేశాం. పిల్లలు అందరూ బాగా నటించారు. ఈ సినిమాకి అన్నీ తానై పని రాక్షసుడిలా శేఖర్ చేశాడు. ఇందులో సప్తగిరి, నేను, రఘు, రమేష్ గజదొంగలుగా నటించాం. కడుపుబ్బా నవ్వుకునేలా ఈ చిత్రం ఉంటుంది”అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News