Home సంగారెడ్డి ఇల్లు కుప్పకూలి వృద్దురాలు మృతి

ఇల్లు కుప్పకూలి వృద్దురాలు మృతి

 Elderly Woman

 

సంగారెడ్డి : గత నాలుగురోజులుగా కురుస్తున్న వర్షానికి సదాశివపేట మండలంలోని మద్దికుంట గ్రామంలో ఓ ఇల్లు కుప్పకూలి వృద్దురాలు మృతిచెందిన సంఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని మద్దికుంట గ్రామంలో చల్లా మాణెమ్మ(70)తో పాటు కూతురు బాగ్యమ్మ, ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మన్నెమ్మ, బాగ్యమ్మ ఉంటున్న ఇంటి గోడలు ముద్దయి ఆదివారం ఉదయం ఐదుగంటలకు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మణెమ్మ అక్కడిక్కడే మృతిచెందింది.

మృతురాలు మాణెమ్మ అంత్యక్రియల్లో స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. దురదృష్టవశాత్తు జరిగిన ఘటన పట్ల ఎమ్మెల్యే దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన ప్రగాఢ సంతపాన్ని తెలిపారు. మృతిచెందిన వృద్దురాలు మణెమ్మ కూతురు బాగ్యమ్మకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి రూ. 50వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భవిష్యత్తులో బాధిత కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి హామీ ఇచ్చారు.

House Collapses and Elderly Woman died