Home తాజా వార్తలు రియల్‌కు ‘కరోనా’ దెబ్బ

రియల్‌కు ‘కరోనా’ దెబ్బ

Housing sales decreased by 49% in H1 2020

 

2 లక్షల ఉద్యోగులను తొలగించే అవకాశం
ఇప్పటికే 60 వేల మందికి పైగా ఉధ్వాసన: నివేదిక

న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అమ్మకాలు తగ్గడంతో రియాల్టీ కంపెనీలు సిబ్బంది తొలగింపు, వేతనాల కోత చర్యలు చేపట్టాల్సి వస్తోంది. రాబోయే నెలల్లో అమ్మకాలు మందగించనున్నాయనే అంచనాతో ఈ కంపెనీలు ఖర్చులను తగ్గించుకుంటున్నాయని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. డీమోనిటైజేషన్, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ (రెరా), గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జిఎస్‌టి), అనుమతుల్లో జాప్యం వంటి అంశాల కారణంగా గత మూడు నాలుగేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.

ఈ రంగంలో 70 లక్షల ఉద్యోగులు
కరోనా వైరస్ మహమ్మారి రియల్ ఎస్టేట్ రంగం బాధలను మరింత పెంచింది. ఇది కొనుగోలుదారులను, అమ్మకాలను ప్రభావితం చేస్తోంది. పరిశ్రమ అంచనాల ప్రకారం, రియల్ ఎస్టేట్ రంగంలో మూడు లక్షల వైట్ కాలర్ కార్మికులతో సహా 60 నుంచి -70 లక్షల మంది ఉద్యోగులున్నారు. మైహైరింగ్‌క్లబ్.కామ్, సర్కారినౌకరీ. అంచనాల ప్రకారం, కరోనా వైరస్ సంక్షోభం కారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో సుమారు 2లక్షల మంది ఉద్యోగులను (వైట్ కాలర్‌తో సహా) తొలగించవచ్చు. ఇప్పటికే 60 వేలకు పైగా ఉద్యోగులకు ఉధ్వాసన పలికినట్టు నివేదికలు చెబుతున్నాయి.

కార్యాలయాల మూసివేత
కన్సల్టింగ్ కంపెనీ ప్రాప్‌కన్సిలియం ఇన్ఫ్రాటెక్ సిఇఒ(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్), మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) రాజేష్ కుమార్ మాట్లాడుతూ, కరోనా సంక్షోభం రియల్ రంగం అమ్మకాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతోంది, కంపెనీల లాభదాయకతను నేరుగా ప్రభావితం చేస్తుందన్నారు. పెండింగ్‌లో ఉన్న చెల్లింపులు డిఫాల్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే చాలా మంది డెవలపర్లు నగదు కొరత సమస్యను ఎదుర్కొంటున్నారని, అందువల్ల వారు ఇప్పుడు ఖర్చులను తగ్గించడంపై దృష్టి సారించారని ఆయన అన్నారు.

దీని కోసం వారు తమ కార్యాలయాలను మూసివేసి తొలగింపులు చేపడుతున్నారని పేర్కొన్నారు. రియల్టీ సంస్థ ప్రజాపతి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ ప్రజాపతి మాట్లాడుతూ, కంపెనీ ఉద్యోగులను తొలగించి, జీతాల్లో 15-20 శాతం కోతలు పెట్టిందని అన్నారు. లాక్‌డౌన్ చేసిన కాలంలో ప్రతి నెలలో 8.3 శాతం ఆదాయాన్ని కోల్పోయామని నాన్-బ్రోకింగ్ రియల్ ఎస్టేట్ పరిశోధన సంస్థ లియాసెస్ ఫోరాస్ తెలిపింది. జూన్ చివరి నాటికి రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఆదాయ నష్టం 26.58 శాతంగా ఉంటుందని, ఇది జూలై చివరి నాటికి 35.07 శాతానికి పెరుగుతుందని నివేదిక పేర్కొంది.

Housing sales decreased by 49% in H1 2020