Home తాజా వార్తలు మేకప్ వస్తువుల్ని ఇలా వాడొచ్చు!

మేకప్ వస్తువుల్ని ఇలా వాడొచ్చు!

Makeup

 

అందాన్ని రెండింతలు చేసే మేకప్ విషయంలో మహిళలు చాలా శ్రద్ధ తీసుకుంటారు. అయితే మేకప్ సామగ్రి సరిగ్గా ఉపయోగించుకుంటే అందాన్ని పెంచుకోవచ్చు. అందుకు కొన్ని చిట్కాలు పాటించండి.

కన్సీలర్: దీన్ని కళ్ల కింద త్రిభుజాకారంలో రాసుకోవడం కొత్త ఫ్యాషన్. కంటి కింద భాగం, చెంపల వైపుగా త్రిభుజాకారంలో కన్సీలర్‌ను ఉపయోగిస్తే మరింత అందంగా, యవ్వనంగా కనిపిస్తారు.

కాటుక: పొడిబారిన కాటుక డబ్బాను పాడేయకుండా, దాన్ని తిరిగి ఉపయోగించేలా చేయొచ్చు. గట్టిపడిన కాటుక మీద కొన్ని చుక్కల లెన్స్ లిక్విడ్ చల్లాలి. దాంతో కాటుక తడిగా అయి మళ్లీ కళ్లకు పెట్టుకునేందుకు అనువుగా ఉంటుంది.
మేకప్ వస్తువులు: కంపాక్ట్ పౌడర్, బ్లష్ వంటి మేకప్ ఉత్పత్తులు ముక్కలైనప్పుడు వాటిని తిరిగి సరిచేయవచ్చు.

ఐ పెన్సిల్: జెల్ లైనర్ అందుబాటులో లేనప్పుడు ఐ పెన్సిల్‌ను జెల్ లైనర్‌గా మార్చేయొచ్చు. బ్లో డ్రైయర్ సాయంతో ఐ పెన్సిల్ కొసను వేడి చేస్తే పెన్సిల్ చివరి భాగం మృదువుగా మారుతుంది. అప్పుడు జెల్ లైనర్‌గా ఉపయోగించుకోవచ్చు.

How Makeup objects can be used