Home తాజా వార్తలు ఇంటి జీవితకాలం ఎంత ?

ఇంటి జీవితకాలం ఎంత ?

kerala-house_manatelangana copyఇంటి జీవితకాలం అనేది దానికి వినియోగించిన మెటీరియల్ నాణ్యతను బట్టి ఆధారపడి ఉంటుంది. మంచి నాణ్యతకలిగిన ఇసుక, సిమెంటు, స్టీల్‌ను వాడినట్లైతే, గరిష్టంగా 30 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు మన్నికగా ఉంటుంది. ఆ తరువాత నుంచి ఇంటి ధరలో తరుగుదల ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అయితే ఇంటి నిర్మాణంతో పోలిస్తే ప్లాట్ విసీర్ణం ధరలో పెరుగుదల ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఇంటి కొనుగోలు అమ్మకాల సమయంలో ఇంటి నిర్మాణానికి, పెద్దగా రేటు రాదు. ప్లాటుకే ఎక్కువ రేటు వస్తుంది. 3౦ ఏళ్ళు పైబడినా, ఇల్లు చెక్కు చెదరకుండా ఉందంటే, మంచి ప్రమాణాలతో నిర్మించినట్లే లెక్క.
నాణ్యత తక్కువ కలిగిన మెటీరియల్‌ను వినియోగించి ఇంటిని నిర్మిస్తే కొంతకాలానికి స్లాబ్ పెచ్చులూడటం. కలప చెదలు పట్టడం, స్లాబు నుంచి,గోడలోపలి వరకు నీరు లీకేజీ కావటం, డ్రైనేజీ పైపులు పగిలిపోవటం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో ఇంటికి తరుచుగా, మరమ్మత్తులు చేయాల్సి ఉంటుంది. దీనికి జీవితకాలం ఇంత అని చెప్పలేం. నాణ్యత తక్కువ కలిగిన ఇంటి నిర్మాణం కేవలం 1౦ -15 సంవత్సరాలకు మించి మన్నికగా ఉండదనే విషయాన్ని గ్రహించాలి. ఇలా మరమ్మత్తుల కోసం తరచుగా ఖర్చు చేసేబదులు, ఒకే సారి మంచి నాణ్యతకలిగిన మెటీరియల్‌ను వినియోగిస్తే, మరమ్మత్తు ఖర్చులుండవు, ఎక్కువ కాలం ఇంటిలో ప్రశాంతంగా జీవించవచ్చు.
ఇంటి జీవితకాలాన్ని పెంచుకోవాలంటే ?
ఇంటిని నిర్మించేటప్పుడే ఫిల్లర్లను తప్పనిసరిగా వేయాలి. అలాగే వినియోగించే స్టీల్ మన్నికైనదై ఉండాలి.
ఇంటి నిర్మాణం పూర్తి చేసిన తరువాత, ఫిల్లర్లను అలా వదిలేయకుండా, గాలి, వర్షం నుంచి ఫిల్లర్లలోని స్టీలు తృప్పు పట్టకుండా, దిమ్మలను నిర్మించుకోవాలి.
రెండు మూడు ఫ్లోర్లు వేసే వారు గ్రౌండ్‌ఫ్లోర్ గోడలను మందంగా నిర్మించుకోవాలి. ఆతరువాత పైన ఎన్నిఫ్లోర్లువేసినా, నిలుస్తుంది.
పైఫ్లోర్‌లో గోడలను నిర్మించేటప్పుడు, కింద ఉన్న గోడ చివర నుంచి నిర్మిస్తుంటారు. ఇది సరికాదు. కిందగోడ మందంలో మధ్యలో నుంచి, పై ఫ్లోర్ గోడను నిర్మించాలి.

నీరు లీకేజీలు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంటి నిర్మాణంలో ఉన్నప్పుడు క్యూరింగ్ సరిగా ఉంటే, గోడలు, స్లాబు మన్నికగా ఉంటాయి.
ఇంటి నిర్మాణంలో బీములను అవసరం మేరకు నిర్మించుకోండి. చాలా మంది ఇది అదనపు ఖర్చుగా భావిస్తుంటారు. పోర్టికో పెద్దగా ఉన్నప్పుడు, పిట్టగోడ వద్ద బీములు బరువును నియంత్రించటంలో సహకరిస్తాయని గుర్తుంచుకోండి.
ఫిల్లర్లు లేని ఇంటిపై మరో ఫ్లోర్ వేయకపోవటమే ఉత్తమం. 3౦ సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇంటి నిర్మాణాలపై అదనపు గదులు, ఫ్లోర్లు నిర్మించుకోవద్దు.
రెండు ఫ్లోర్లు ఉన్న ఇంటిలో కింద ఎలాంటి స్ట్రక్చర్‌ను ఫాలో అయ్యారో, పైఫ్లోర్ కూడా అలాగే స్ట్రక్చర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీని ద్వారా కిందిఫ్లోర్‌పై అదనపు భారం పడదు.