Home రాష్ట్ర వార్తలు ఎంత సమయం కావాలి?

ఎంత సమయం కావాలి?

టిఆర్‌ఎస్‌లో చేరిన నలుగురు కాంగ్రెస్ ఎంఎల్‌ఎలపై నిర్ణయానికి ఎంత వ్యవధి కావాలో నవంబర్ 8లోగా సమాధానం చెప్పాలని స్పీకర్‌ను కోరిన సుప్రీంకోర్టు, ఆ రోజుకి ఫిరాయింపుదారుల అనర్హత పిటిషన్‌పై విచారణ వాయిదా 

supreme-courtన్యూఢిల్లీ : చేయి గుర్తుపై కింద టి ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత పార్టీ ఫిరాయిం పులకు పాల్పడి అధికార పార్టీ టిఆర్‌ఎస్‌లో చేరిన నలుగురు ఎంఎల్‌ఎలను అనర్హులుగా ప్రకటిం చాలని కోరుతూ కాంగ్రెస్ ఎంఎల్‌ఎ సంపత్ చేసిన విజ్ఞప్తిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఎంత సమయం కావాలో నవంబర్ 8 లోగా తమకు తెలి పాలని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనచారిని అత్యు న్నత న్యాయస్థానం ఆదేశించింది. కాంగ్రెస్ ఎం ఎల్‌ఎ సంపత్ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధ వారం విచారణ జరిపిన జస్టిస్ కురియన్, జస్టిస్ జోసెఫ్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశా లు జారీ చేసింది. సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన నోటీసులు ఇంకా స్పీకర్‌తో పాటు ఎంఎల్‌ఎ లకు అందలేదని ప్రభుత్వం తరపున న్యాయవాది వాదించారు. నోటీసులు అందకుండానే నిర్ణయం తీసుకునేందుకు గడువు విధించడం సరికాదని అన్నారు. మరోవైపు అనివార్య కారణాల వల్ల అటార్నీ జనరల్ కూడా విచారణకు హాజరు కాలేక పోయినందున వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశా రు. ఈ వాదనలను పిటిషనర్ తరపు న్యాయావాది గట్టిగా వ్యతిరేకించారు. పార్టీ ఫిరాయించిన ఎం ఎల్‌ఎలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌కు 2014 అగస్టులో చేసిన ఫిర్యాదుపై రెండేళ్లు గడుస్తున్నా అతీగతిలేదని అన్నారు. ఇదే అంశంపై 2015లో హైకోర్టును ఆశ్రయించగా స్పీకర్ సకాలంలో స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ హైకోర్టు బంతిని స్పీకర్ కోర్టులోకి నెట్టి ఏడాది గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేదనందున అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని కోరారు. అనర్హత ప్రక్రియ ను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మరో వైపు నోటీసులు అందలేదని రాష్ట్ర సర్కారు తరపు న్యాయవాది చేస్తున్న వాదనల్లో నిజం లేదని అన్నారు.
అసెంబ్లీ సమావేశాలు నడుస్తుండగా నిండు సభలో పోడియం వద్దకు వెళ్లి మరీ స్పీ కర్‌కు ఎంఎల్‌ఎ సంపత్ దస్త్రీలు అందించారని చెప్పారు. సమావేశాలకు హాజరైన నలుగురు ఎమ్మెల్యేలకు దస్త్రీలు అందించిన దృష్యాలు కూడా అన్ని వార్తా ఛానళ్లలో ప్రసారం అయ్యాయని సదరు సీడీలను కూడా గతంలోనే ధర్మాసనంకు సమర్పించినట్లు వెల్లడించారు. అనర్హత పిటిషన్‌పై ముందు స్పీకర్‌కు మార్గదర్శకాలు జారీ చేసి కావా లంటే ఆ తదుపరి అటార్నీ జనరల్ వాద నలు వినాలని విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం అనర్హతలపై నిర్ణయం తీసుకు నేందుకు ఎంత సమయం కావాలో నవంబర్ 8లోగా తెలపాలని స్పీకర్‌ను ధర్మాసనం ఆదేశిం చింది. విచారణ ముగిసిన అనంతరం పిటిషనర్ సంపత్ సుప్రీంకోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సర్కారుపై దుమ్మెత్తి పోశారు. టిఆర్‌ఎస్ సర్కారు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యా న్ని, నైతిక విలువలను తుంగలో తొక్కి డబ్బు సం చులతో కొనుక్కున్న ఎమ్మెల్యేలను కాపాడుకు నేందుకు సుప్రీంకోర్టుకు కుంటి సాకులు చెప్తూ కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. తనతో పాటే పార్టీ ఫిరాయింపుదారులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎర్రబెల్లిదయాకర్‌రావు కూడా ఆతర్వాత గులాబీ తీర్థం పుచ్చుకోవడం సిగ్గుచేటని అన్నారు. సుప్రీంకోర్టు జోక్యంతో ప్రజాస్వామ్య స్పూర్తి విజయం సాధిస్తుందనే నమ్మకం తనకు ఉందని అన్నారు. నలుగురు ఎంఎల్‌ఎలను సుప్రీంకోర్టు తప్పక అనర్హులుగా ప్రకటిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ తీర్పు టీఆర్‌ఎస్‌లో చేరిన మిగతా ఎమ్మెల్యేలకు వర్తించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు.