Tuesday, February 7, 2023

ఏ బొట్టు ఎలా!

  • Bindiనుదుటిమీద బొట్టు లేక బింది లేక స్టిక్కర్లు ఇది పెట్టుకుంటేనే కాని మేకప్ పూర్తయినట్లు కాదు. బిందీ పెట్టుకుంటే మొత్తం ముఖానికి ఒక అందం వస్తుంది.
  • మన భారత దేశంలో బొట్టుకు మంచి ప్రాముఖ్యత ఉంది. పూర్వం బొట్టుకి కుంకుంగాని తిలకంగాని వాడేవారు. ఇప్పుడు స్టిక్కర్లు ఎన్నో ఆకారాలలో, రంగులలో, మెరుపుల, రాళ్లతో, బంగారపు పూసలతో లభిస్తున్నాయి. ఏవి ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుకుంటే మనం అందంగా కనిపించవచ్చు.
  • పొడవైన బిందీని చిన్న నుదురు ఉన్నవారు. గుండ్రటి బిందిని పెద్ద నుదురు ఉన్నవారికి ఎర్రని ఎరుపు రంగు బొట్టు బావుంటుంది.
  • పెద్ద కళ్లు ఉన్నవారు పెద్ద స్టిక్కర్‌ను, చిన్న కళ్లు ఉన్నవారు చిన్నస్టిక్కర్‌ను పెట్టుకుంటే బావుంటుంది.
  • ఎత్తులో కూడా పొడవుగా ఉన్నవారికి గుండ్రని బొట్టు, ఎత్తు తక్కువ ఉండేవారికి పొడవైన బొట్టు నప్పుతుంది.
  • నుదురు వెడల్పుగా ఉంటే బొట్టు మధ్యలో, నుదురు చిన్నగా ఉంటే కనుబొమల మధ్యన పెట్టుకోవాలి.
  • వేసవి లో లేతరంగులు, శీతా కాలంలో రాత్రులు ముదురు రంగు బొట్టు పెట్టుకోవాలి. వేసుకున్న బట్టలకి బొట్టు కూడా మ్యాచ్ అయ్యేలా ఉంటే చాలా బావుంటుంది.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles