Home లైఫ్ స్టైల్ ఒత్తిడిని చిత్తుచేసే సహజ పద్ధతులు

ఒత్తిడిని చిత్తుచేసే సహజ పద్ధతులు

stress

చిన్న నుంచి పెద్ద వరకు ఒత్తిడికి గురికానివారు నేడు లేరనే చెప్పొచ్చు. ఒక్కొక్కరిది ఒక్కోరకమైన ఒత్తిడి, అయితే దీనినుంచి బయటపడేందుకు మందులు తప్ప మార్గం లేదా అంటే, ఒత్తిడిని త్వరగా గుర్తించి, సరైన నిర్వహణతో అధిగమించవచ్చు…

 • సమస్యను సరైన సమయంలో గుర్తించడం అవసరం
 • ప్రతికూల ఆలోచనలను దరిచేరనీయకండి
 • సమయాన్ని సరిగా నిర్వహించుకోవడం
 • మన గూర్చి మనం జాగ్రత్త తీసుకోవడం
 • మన చుట్టూ మనకుపయోగపడే వాటిని ఏర్పాటుచేసుకోవడం
 • ధృఢమైన నైపుణ్యాలను ఏర్పర్చుకోవడం

సరైన సమయంలో సమస్యను గుర్తించడం : ఒత్తిడిపై పోరాటం చేయాలంటే మొదట ప్రతికూల భావనలు ఎందుకు వస్తున్నాయో గుర్తించాలి. ఈ సమస్యను గుర్తించడానికి ఎబిసి(abc) ని అమలు చేయాల్సి ఉంటుంది. ఎ = ఎవేర్‌నెస్(అవగాహన), బి = బ్యాలెన్స్ ( సమతూకం). సి = కంట్రోల్(నియంత్రణ)

ప్రతికూల ఆలోచనలను దరిచేరనీయొద్దు : ఒత్తిడిని జయించాలంటే మొట్టమొదటి సూత్రం ప్రతికూల ఆలోచనలను మార్చుకోవడం లేదా దరిచేరనీయకపోవడం అవసరం. ఈ రకమైన ఆలోచనలతో ఏర్పడే ఒత్తిడిని తట్టుకునేందుకు కొన్ని చిట్కాలు

తిరిగి రూపొందించుకోవడం(రీ ఫ్రేమ్) : ఏదైనా సంఘటన మిమ్మల్ని గాయపరిస్తే, పరిస్థితులను అర్థం చేసుకుని తిరిగి అభిప్రాయాన్ని ఏర్పర్చుకోవడం మంచిది.

సానుకూలంగా ఆలోచించడం : శక్తిలేకుండా ఉన్నామనే భావన, నిరాశ, వైఫల్యం చెందామనే భావనలనుంచి బయటపడి, సానుకూలమైన అంశాలపై దృష్టి పెట్టడం మంచిది.

 • అతి చిన్న విషయాలనుకూడా విశదీకరించుకుని విశ్లేషించుకోవాలి.
 • విషయాన్ని మరోకోణంలో నుంచి చూడడం అవసరం
 • మీకు సంబంధించిన విషయాన్ని ఎవరైనా వేలెత్తి చూపితే దాన్ని నిజంలా కాకుండా ఒక సమాచారంగా స్వీకరించడం మంచిది. సమయాన్ని సరిగా నిర్వహించుకోవడం – ఒత్తిడి తగ్గడానికి, పెరగడానికి సమయంతో సంబంధముంది. సమయపాలనకు కొన్ని

చిట్కాలు

 • చేయాల్సిన పనులకు సంబంధించిన వివరాలను రాసుకోవాలి. వాటిల్లో కూడా…
 • తప్పకుండా చేయాల్సినవి, చేయాల్సినవి, ఏది ఇష్టమో అదే చేయాలనుకోవడం
 • సమయం వృథా కాకుండా చూసుకోవడం
 • అవసరం లేని పనులను చేయకుండా ఉండడం
 • రోజులో చేయాల్సిన పనులను సరిగా నిర్ణయించుకోవడం
 • చేరుకునే లక్ష్యాలను నిర్దేశించుకోవడం
 • చేయలేని పనులగూర్చి మీకు మీరే క్షమించుకుంటూ సమయాన్ని వృథా చేయకుండా ఉండడం
 • మధ్య మధ్యన పనిచేయడం. మనకుపయోగపడేవాటిని ఏర్పాటుచేసుకోవడం
 • బంధాలను బలంగా చేసుకోవడం : మీ బంధుత్వాల గూర్చి ఎక్కువ విలువ, సమయం కేటాయించాలి
 • మీ ఆలోచనలను, అభిప్రాయాలను, అనుభవాలను పంచుకుంటూ, అవతలివారివి కూడా వినడం అలవాటుచేసుకోవాలి
 • పాత స్నేహితులను తిరిగి కలుసుకునేలా ఏర్పాటుచేసుకోవడం
 • దూరాన ఉన్నవారికి మెయిల్ చేయడం, ఉత్తరం రాయడం, దూరంగా ఉన్నవారిని సోషల్ మీడియా ద్వారా పలకరించడం, ఫోన్‌లో మాట్లాడే ప్రయత్నం చేయడం, కొత్త స్నేహాలను చేయడం. మన గూర్చి మనం జాగ్రత్త తీసుకోవడం
 • ఆహారం తీసుకునే విషయంలో, పొగతాగడం, మద్యపానం విషయంలో జాగ్రత్త, వ్యాయామం చేయడం, సరైన నిద్ర, విశ్రాంతిగా గడపడం, సేదదీరడం.

మన కోసం మనం సమయం కేటాయించుకోవడం.ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఒత్తిడిని ఎదుర్కోవడంలో ఆహారం కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది.

 • ప్రతి రోజు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తాగడం వల్ల శారీరక వ్యవస్థ సరిగా పనిచేస్తుంది, కెఫీన్ ఉన్న పదార్థాలను తీసుకోకపోవడం
 • తక్కువ పరిమాణంలో తరచూ ఆహారం తీసుకోవడం
 • తృణధాన్యాలు తీసుకోవడం
 • కార్బోహైడ్రేట్ల వాడకాన్ని తగ్గించడం
 • సాచ్యురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్లకు దూరంగా ఉండడం
 • చేపలు, పౌల్ట్రీకి సంబంధించిన ఆహారపదార్థాల్లో లభించే ప్రోటీన్‌ను ఆహారంలో చేర్చడం
 • క్యాల్షియం, విటమిన్ డి లను తీసుకోవడం * ఉప్పు, సోడియం ను 2.300 మిల్లీగ్రాములకు తగ్గించడం
 • ప్రాసెస్డ్, ప్యాకేజ్‌డ్ ఆహారాన్ని తీసుకోకపోవడం.