Friday, April 26, 2024

ఫాస్టాగ్‌తో పెట్రోల్ బిల్లు చెల్లింపు

- Advertisement -
- Advertisement -
HPCL partners with ICICI Bank for fuel payments
ఐసిఐసిఐ బ్యాంక్‌తో హెచ్‌పిసిఎల్ ఒప్పందం

న్యూఢిల్లీ: వాహనదారులు ఇకపై తమ వాహనంలో ఇంధనం అయిపోయిందని ఆందోళన చెందాల్సిన పని లేదు. జేబులో డబ్బులు లేకపోయినా సమీపంలోనిపెట్రోల్ బంకులో ఫ్యూయల్, లూబ్రికెంట్ ఆయిల్ నింపుకుని ఫాస్టాగ్ కోడ్ ద్వారా పెట్రోల్ బిల్లు చెల్లించవచ్చు. కేంద్ర పెట్రోలియం సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) ఇందుకోసం ప్రైవేట్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఫాస్టాగ్ ద్వారా పెట్రోల్ బిల్లుల చెల్లింపులకు అనుమతిచ్చిన తొలి సంస్థగా హెచ్‌పిసిఎల్ నిలిచింది.

టోల్‌గేట్ల వద్ద రద్దీని తగ్గించడానికి ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికోసం ఫాస్టాగ్ వ్యవస్థ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. వివిధ కార్ల యజమానులు కూడా తమ బ్యాంక్ ఖాతాతో ఫాస్టాగ్‌ను అనుసంధానించుకున్నారు. కనుక కార్ల యజమానులు తమ ఫాస్టాగ్ కోడ్‌తో హెచ్‌పిసిఎల్ బంకుల్లో పెట్రోల్ నింపుకోవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ ఫాస్టాగ్‌ను కమర్షియల్ వాహనదారులు ఫ్యూయల్, టోల్, పార్కింగ్ పేమెంట్స్‌కు ఉపయోగించుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న 19 వేల హెచ్‌పిసిఎల్ పెట్రోల్ బంకుల్లో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News