Home స్పెషల్ ఆర్టికల్స్ నగరానికి డబ్బులు వచ్చేశాయ్

నగరానికి డబ్బులు వచ్చేశాయ్

Cash

సిటీబ్యూరో :  నగర ప్రజలకు నోటు  కష్టాలు తీరనున్నాయి. గత కొద్ది రోజులుగా నగరంలో ఉన్న ఏటీఎంలలో 90 శాతం నో క్యాష్ బోర్డులు దర్శనం ఇచ్చాయి.  దీంతో నగర వాసులు మూడు వారాలుగా  వారి చిన్ని అవసరాలను కూడా వాయిదా వేసుకోవడంతో వారు  తీవ్ర ఇబ్బందుల కు గురి కావాల్సి వచ్చింది. ఎంటీఎంలో డబ్బులు లభించక పోవడంతో రెండు ఎంటీఎం కేంద్రాలను వినియోగ దారులు ధ్వసం  చేసిన సంగతి తెలిసిందే.

రిజర్వు బ్యాంకు నుంచి బ్యాంకలకు డబ్బులను సరఫరా చేయక పోవడంతో ఈ సమస్య ఉత్పన్నమైనట్లు తెలిసింది. అయితే  శుక్రవారం నగరంలో రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కు  నాలుగు  పెద్ద కంటైనర్లలో క్యాష్ వచ్చి చేరింది. వాటిలో పెద్ద మొత్తంలో రూ. 2 వేల నోట్లు, 500ల నోట్లు తెలిసింది.ఈ మెత్తం నగరంలో అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ బ్యాంకులకే కాకుండా ఇతర జిల్లాకు కూడా సరఫరా చేయనున్నారు. త్వరలో రెండు మూడు రోజుల్లో నగర ప్రజల నోటు కష్టాలు తీరనున్నట్లు అధికారులు తెలిపారు.