Friday, March 29, 2024

అమెరికాలో చదువుకున్నోళ్లకే హెచ్1 బి అందలం

- Advertisement -
- Advertisement -

Huge changes in H1B work visas and L1 visa issuance

 

అక్కడి విదేశీ యువతకే అధిక ప్రాధాన్యం
వర్క్ వీసాలు, ఎల్ 1 వీసాల జారీలో భారీ మార్పులు
రెండు చట్టసభలలో బిల్లు ప్రతిపాదన
భారతీయ యువతకు భలే ఛాన్స్?

 

వాషింగ్టన్ : అమెరికాలో హెచ్ 1 బి వర్క్ వీసాలు, ఎల్ 1 వీసాల జారీలో భారీ మార్పులను ప్రతిపాదిస్తూ చట్టసభలలో బిల్లు ప్రవేశపెట్టారు. అమెరికాలో చదివిన విదేశీ యువతకు తొలి ప్రాధాన్యత దక్కేలా చేసే ఉద్ధేశంతో దేశంలోని రెండు చట్టసభలలో ఏకకాలంలో బిల్లును తీసుకువచ్చారు. ద్విపార్టీ విధానం ఉన్న అమెరికాలో ఒకేసారి ఒకే విధమైన లెజిస్లేషన్ కోసం బిల్లు తీసుకురావడం ఇదే తొలిసారి. ఈ బిల్లు ప్రతిపాదనలో అమెరికా పౌరుల ఉపాధి రక్షణ కీలక లక్షం అయినప్పటికీ, ఇప్పటికే అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థులకు కూడా ఇది మేలు చేస్తుందని భావిస్తున్నారు. ప్రత్యేకించి యువ ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ బిల్లు ఉపయోగపడుతుంది. ది హెచ్ 1 బి అండ్ ఎల్ 1 వీసా రిఫార్మ్ యాక్ట్ పేరిట ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రస్తుత వీసా సంస్కరణల ఘట్టంలో అంత్యంత కీలకమైదిగా భావిస్తున్నారు.

ప్రతిభావంతులు, అమెరికాలో చదివిన వారికి వీసాల మంజూరీలో ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలని , అయితే ఇదే సమయంలో ఉద్యోగాలలో అమెరికన్లకు ఉండే కోటాను హెచ్ 1 బి వీసా, ఎల్ 1 వీసాదార్లతో భర్తీ చేయరాదని కూడా బిల్లులో ప్రతిపాదించారు. అమెరికాలో హెచ్1 బి వీసా నాన్ ఇమ్మిగ్రేషన్ వీసాగా యువత ఉపాధి ఘట్టంలో బాగా ప్రచారం పొందింది. ఈ వీసా విధానంతో అమెరికా ప్రతిష్టాత్మక కంపెనీలు విదేశీ యువ ప్రతిభావంతులను ఉద్యోగాలలోకి తీసుకుంటున్నాయి. ఇండియా, చైనా వంటి దేశాల నుంచి అత్యధిక సంఖ్యలో ప్రతి ఏటా ఈ వీసా విధానంలో భర్తీ చేస్తున్నారు. ఎప్రిల్ 1వ తేదీన అమెరికా పౌరసత్వ వలస విధాన సేవల విభాగం (యుఎస్‌సిఐఎస్) ఈ తరహా వీసాలపై సమగ్ర ప్రకటన వెలువరించింది. దీని మేరకు అమెరికాలో దాదాపు 2,75,000 మంది నుంచి వీసా దరఖాస్తులు అందాయి.

అయితే విదేశీ సాంకేతిక వృత్తి నిపుణులకు అమెరికాలో చట్టపరంగా 85000 వీసాలను మంజూరు చేసే పరిమితి ఉంది. మంజూరీ కోటాలో భారతీయ నిపుణుల వాటానే ఇప్పటికైతే 67 శాతాన్ని మించి ఉంది. చైనా తరువాత ఇండియా విద్యార్థులే అమెరికాలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో రెండు లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుత కీలక బిల్లులను సెనెట్‌లో ఇద్దరు సెనెటర్లు చుక్ గ్రాస్‌లే, డిక్ డర్బిన్ ప్రతిపాదించారు. ప్రతినిధుల సభలో దీనిని ఎంపిలు బిల్ పాస్క్రెల్, పాల్ గోసార్ ఇతరులు తీసుకువచ్చారు. ఎల్ 1 వీసా విధానంలోనూ కీలక మార్పులకు బిల్లులో ప్రతిపాదనలు తెచ్చారు. ఉద్యోగులకు కనీస వేతన నిర్థారణ, కంపెనీలకు విధివిధానాల వర్తింపు వంటి అంశాలను పొందుపర్చారు.

ఈ మేరకు అంతర్గత భద్రతా విభాగానికి పూర్తి అధికారాలు కల్పించేందుకు ప్రతిపాదనలు చేశారు. కొన్ని అమెరికా కంపెనీలు వీసా నిబంధనలను కాలరాస్తూ తక్కువ వేతనాలతో పనిచేసే వారిని ఉద్యోగాలలోకి తీసుకుంటండటంతో స్థానిక అమెరికన్లు ఉపాధి పోతోందని, దీనిని నివారించేందుకు ఈ బిల్లును తీసుకవచ్చినట్లు చట్టసభ సభ్యులు తెలిపారు. నైపుణ్యవంతులైన అమెరికన్లకు తొలి ప్రాధాన్యత తరువాతి క్రమంలో ఇతర దేశాలకు చెందిన విద్యార్థులకు , అందులోనూ అమెరికాలో చదివిన వారికే ఎక్కువగా ఈ వీసాలు వచ్చేలా చేసే ఉద్ధేశంతో ఈ బిల్లును రూపొందించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News