Home తాజా వార్తలు నటి రాయ్ లక్ష్మికి కరెంట్ షాక్

నటి రాయ్ లక్ష్మికి కరెంట్ షాక్

Actress Raai Lakshmiచెన్నయ్ : ప్రముఖ నటి రాయ్ లక్ష్మికి విద్యుత్ అధికారులు షాక్ ఇచ్చారు. తన ఇంటి కరెంట్ బిల్లు చూస్తే షాక్ కొడుతుందని ఆమె స్వయంగా చెప్పుకొచ్చారు. ఈ నెలలో వచ్చిన బిల్ పే చేస్తే, మరుసటి నెల అంతకు రెట్టింపు బిల్లు వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు నెలలుగా ఇదే తంతు జరుగుతుందని ఆమె చెప్పుకొచ్చారు. ఎలక్ట్రిసిటీ టోల్ ఫ్రీ నెంబర్‌ కు ఫోన్ చేస్తే స్పందన లేదని, తనకు  సాయం చేయాలని ఆమె విద్యుత్ అధికారులను కోరుతున్నారు. తనలాగే చాలా మంది ప్రజలు ఇదే సమస్యతో బాధపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. కష్టపడి డబ్బు సంపాదించి ఇలా కట్టాలంటే తనకెంతో బాధగా ఉందని ఆమె వాపోయారు. ఆమె సమస్య  ఎలక్ట్రిసిటీ బోర్డు దృష్టికి వెళ్లింది. రాయ్ లక్ష్మికి  కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, అకౌంట్ నెంబర్, కాంటాక్ట్ వివరాలను డైరెక్ట్ మెసేజ్ చేయాలని, సమస్యను పరిష్కరిస్తామని విద్యుత్ అధికారులు ఆమెకు హామీ ఇచ్చారు.

Huge Current Bill To Actress Raai Lakshmi house