Thursday, April 18, 2024

బిగ్‘సి’లో భారీ ఫెస్టివ్ ధమాకా ఆఫర్

- Advertisement -
- Advertisement -

Huge Festive Offers in Big C

 

మన తెలంగాణ/ హైదరాబాద్ : పండగ సీజన్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ మొబైల్ రిటైల్ చెయిన్ బిగ్‘సి’ భారీ ఫెస్టివ్ ధమాకా ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ వివరాలను సంస్థ సిఎండి యం.బాలు వెల్లడించారు. బిగ్‘సి’లో ప్రారంభమైన ఈ ఫెస్టివ్ ధమాకా ఆఫర్ వ్యవధిలో సంస్థ షోరూంలలో మొబైల్ కొనుగోలు చేసినవారిలో 100 మందిని లక్కీడ్రా ద్వారా ఎంపిక చేస్తారు. వారికి ఒక్కొక్కరికి రూ.1 లక్ష నగదు బహుమతిని అందజేస్తామని, ఈ విధంగా విజేతలకు మొత్తం రూ.1 కోటి బహుమతిగా ఇస్తామని ఆయన వివరించారు. దీంతోపాటు మొబైల్ కొనుగోలుపై 5000 క్యాష్ పాయింట్లు కూడా ఇస్తామన్నారు. ఇంకా 10 శాతం వరకు క్యాష్ బ్యాంక్, బహుమతులు కూడా అందిస్తున్నామని తెలిపారు. ఆన్‌లైన్‌లో మొబైల్స్ కొన్నవారికి 90 నిమిషాల్లో డోర్ డెలివరీ చేస్తామని అన్నారు.

• సామ్‌సంగ్ ఎ సిరీస్ అండ్ ఎం సిరీస్ మొబైల్ కొనుగోలుపై 10 శాతం హెచ్‌డిఎఫ్‌సి క్యాష్ బ్యాక్
• షియోమీ అన్ని మొబైల్స్‌పై 10 శాతం ఎస్‌బిఐ క్యాష్ బ్యాక్
• వన్‌ప్లస్ మొబైల్స్‌పై రూ.3 వేల వరకు హెచ్‌డిఎఫ్‌సి క్యాష్ బ్యాక్ ఆఫర్
• రూ.101 చెల్లించి ఏదైనా వివో మొబైల్ వడ్డీ లేకుండా పొందవచ్చు
• ఒప్పొ మొబైల్స్‌పై 10 శాతం వరకు క్యాష్ బ్యాక్
• సులభ వాయిదాల పద్ధతిలో డౌన్ పేమెంట్, వడ్డీ లేకుండా మొబైల్ కొనే సౌకర్యం

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News