కోల్కతా : కోల్కతాలోని స్ట్రాండ్ రోడ్లో ఉన్న ఓ భవనంలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. బుధవారం ఉదయం 7.50 గంటల ప్రాంతంలో బహుళ అంతస్థుల భవనంలోని నాలుగో ఫ్లోర్లో ఉన్న బ్యాంకులో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. షార్టుసర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ నెల మొదటి వారంలో స్ట్రాండ్ రోడ్లోని రైల్వే భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగి తొమ్మిది మంది చనిపోయిన విషయం తెలిసిందే.