Friday, March 29, 2024

యాదాద్రికి భారీగా స్వర్ణ విరాళాలు

- Advertisement -
- Advertisement -

Huge gold donations to Yadadri

మెగా ఇంజనీరింగ్ 6 కిలోలు

ప్రణీత్ గ్రూప్ 2 కిలోలు కెఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ఎండి
కామిడి నర్సింహారెడ్డి 2 కిలోలు జలవిహార్ ఎండి 1 కిలో
బంగారం విరాళంగా ఇస్తామని ప్రకటన

మనతెలంగాణ/హైదరాబాద్ : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ విమాన గోపురం బంగారం తాపడానికి పలువురు దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. సిఎం కెసిఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని మొదటిరోజు దాతలు విరాళాలను భారీగా ప్రకటించిన విషయం తెలిసిందే. అదేవిధంగా రెండోరోజు కూడా పలువురు దాతలు విరాళాలను ఇవ్వడానికి ముందుకొచ్చారు. ముందుగా మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) 6 కిలోల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించగా, వీరితో పాటు ప్రణీత్ గ్రూప్ ఎండి నరేంద్ర కుమార్ కామరాజు 2 కిలోల బంగారాన్ని, చెన్నూరు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, వివేకానందలు చెరో కిలో బంగారాన్ని, జలవిహార్ ఎండి రామరాజు కిలో బంగారం, కెఎన్‌ఆర్ కన్ స్ట్రక్షన్స్ ఎండి కామిడి నర్సింహారెడ్డి 2 కిలోల బంగారాన్ని విరాళంగా ప్రకటించారు.

ఇండియన్ బ్యాంక్ అకౌంట్‌లో….

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయం, విమాన గోపురం, బంగారు పూత కోసం విరాళాలు అందజేయాలనుకునే దాతలు ఇండియన్ బ్యాంక్ అకౌంట్‌లో (6814884695, ఐఎఫ్‌ఎస్‌సి కోడ్ IDIB000Y011) డబ్బులను జమ చేయవచ్చని యాదాద్రి ఆలయ ఈఓ గీతారెడ్డి తెలిపారు.

ఈ పుణ్య కార్యంలో పాలుపంచుకోవడం సంతోషం: మెయిల్ డైరెక్టర్

ఈ సందర్భంగా మెయిల్ డైరెక్టర్ బి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ గోపురానికి బంగారు తాపడం ఎంతో పుణ్య కార్యక్రమమని, ఇందులో తాము పాలుపంచుకోవడం తమకు ఎంతో గౌరవప్రదమన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఆరు కేజీల బంగారం లేదా అందుకు సమానమైన మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేస్తానని ఆయన తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన, పుణ్యస్థలమైన యాదాద్రి ముఖ్యమంత్రి ఆలోచనాత్మక రూపకల్పనలో మరింత అందంగా రూపుదిద్దుకుని, దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారుతుందని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

గొప్ప చక్రవర్తులు సాధించిన ఘనత సిఎం సాధించారు: జలవిహార్, ఎండి

యాదాద్రి దేవాలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం ప్రముఖ వ్యాపారవేత్త, జలవిహార్, ఎండి, ఎన్.వి.రామరాజు ఒక కిలో బంగారాన్ని అందజేస్తామని ప్రకటించారు. యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ మహత్కార్యంలో తమకు భాగస్వామ్యం కల్పించినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మన భారతదేశం ఎంతోమంది గొప్ప చక్రవర్తులకు ప్రసిద్ధి పొందింది. చెట్లు నాటడంలో అశోకుడు, నీటిపారుదల వ్యవస్థ నిర్మాణంలో రాణీ రుద్రమదేవి, దేవాలయాల నిర్మాణానికి రాజరాజ చోళుడు, సంస్కృతీ, సంప్ర దాయాల పరిరక్షణకు శ్రీకృష్ణ దేవరాయలు ఎంతో గొప్ప కృషి చేసి, చరిత్ర గతిలో ప్రసిద్ధి పొందారని ఆయన తెలిపారు. ఆ గొప్ప చక్రవర్తులు సాధించిన ఘనతలను మన ముఖ్యమంత్రి కెసిఆర్ దశాబ్దకాలంలోనే సాకారం చేయగలిగారని ఆయన తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణం, హరితహారం, యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, మహా చండీయాగం వంటి మహత్కార్యాలను పూర్తి చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దేనని ఆయన తెలిపారు.

విరాళం ప్రకటించిన వారి వివరాలు

దాతలు                                                                  విరాళం (బంగారం)

మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ –                           6 కిలోలు
ప్రణీత్ గ్రూప్ ఎండి నరేంద్ర కుమార్ కామరాజు –                               2 కిలోలు
జలవిహార్ ఎండి రామరాజు –                                                  1 కిలో
హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పార్థసారథి రెడ్డి –                          5 కిలోలు
ఎమ్మెల్యే బాల్క సుమన్                                                       1 కిలో
ఎమ్మెల్యే వివేకానంద –                                                        1 కిలో
కెఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ఎండి కామిడి నర్సింహారెడ్డి                               2 కిలోలు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News