Home జాతీయ వార్తలు బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలు

బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలు

Banking Sectorఢిల్లీ : బ్యాంకింగ్ రంగంలో కేంద్రం భారీ సంస్కరణలు చేసింది. దేశంలోని 11,437 శాఖలను విలీనం చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. కెనరా బ్యాంకు, సిండికేట్ బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు ఆమె వెల్లడించారు. అదేవిధంగా ఆంధ్రా బ్యాంకు,యూనియన్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులను విలీనం చేశామని, ఇండియన్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకులను కూడా విలీనం చేశామని ఆమె చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఓరియెంటల్ బ్యాంకు, యునైటెడ్ బ్యాంకులను సైతం విలీనం చేశామని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో దేశంలో రెండో అతపెద్ద బ్యాంకుల విలీనం జరిగిందన్నారు. ఈ బ్యాంకుల విలీనం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈమేరకు ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

Huge Reforms In Banking Sector