Home Default శంకర్ సినిమా : రామ్ చరణ్ కు భారీ రెమ్యునరేషన్

శంకర్ సినిమా : రామ్ చరణ్ కు భారీ రెమ్యునరేషన్

Huge Remuneration To Ram Charan For Shankar Movieహైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా సినీమా వస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం రామ్ చరణ్ రూ.80 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. శంకర్ రూపొందించే ఈ సినమా రామ్ చరణ్ కు 15వది కావడం గమనార్హం. ఈ సినిమా దిల్ రాజ్ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సారధ్యంలో వస్తున్న 50వది. అయితే టాలీవుడ్ లో అధిక మొత్తంలో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోలలో ప్రభాస్ ఉండగా, ఆయన తర్వాతి స్థానంలో రామ్ చరణ్ నిలుస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా  కియారా అద్వానీ నటిస్తున్నారు. అంజలి, శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీత అందిస్తున్నారు.