Friday, April 19, 2024

పిఎంవివివై పథకానికి అనూహ్య స్పందన

- Advertisement -
- Advertisement -

60ఏళ్లు నిండినవారికే అర్హత
ఎల్‌ఐసి కార్యాలయాలకు క్యూ కడుతున్న సీనియర్ సిటిజన్స్

న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్స్ ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవకుండా ఉండేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త పెన్షన్ పథకానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ పథకానికి ప్రధానమంత్రి వయ వందన యోజన పిలుస్తున్నారు. పిఎంవివివైలో సభ్యత్వం తీసుకునేందుకు చివరి తేదీని మార్చి 31, వరకు కేంద్రం పొడిగించింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ పెన్షన్ స్కీమ్‌ను లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా అమలు చేస్తుంది. 60సంవత్సరాలు నిండినవారు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న సీనియర్ సిటిజన్స్ ఈ పథకానికి అర్హులు. గరిష్ఠ వయోపరిమితి లేదు. ఒకేసారి మొత్తం చెల్లించి ప్లాన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత ఎల్‌ఐసి పెన్షనర్‌కు ప్రీమియంను తిరిగి చెల్లిస్తుంది. ప్రధానమంత్రి వయ వందన యోజన పాలసీ వ్యవధి 10సంవత్సరాలుగా నిర్ణయించారు. ఈ స్కీమ్‌లో చేరినవారికి లేదా త్రైమాసికం లేదా అర్ధసంవత్సరం లేదా వార్షిక ప్రాతిపదికన పెన్షన్ చెల్లిస్తారు. ప్లాన్ కొనుగోలు సమయంలోనే చందాదారు ఆప్షన్‌ను ఎంచుకోవాలి. కనీస, గరిష్ఠ పింఛన్ మొత్తం కొనుగోలు చేసిన ప్లాన్‌పై ఆధారపడి ఉంటుంది.

నెలవారీ రూ.1000, త్రైమాసిక పెన్షన్ రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, సంవత్సరానికి రూ.12,000 కనిష్ఠ పింఛన్ పొందవచ్చు. అదేవిధంగా గరిష్ఠ పింఛన్ నెలకు రూ.9,250, సంవత్సరానికి రూ.1,11,000 పింఛన్ పొందవచ్చు. కాగా నెలవారీ రూ.1000 పింఛన్ కోసం 1,62,162 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. గరిష్ఠంగా రూ.15లక్షల వరకు ప్రీమియం చెల్లించవచ్చు. ప్రీమియం బట్టి పింఛన్ చెల్లిస్తారు. పాలసీ డాక్యుమెంట్‌లో పేరొన్న ప్రకారం ప్లాన్ కొనుగోలు చేసిన తేదీ నుంచి ఒక నెల, మూడు నెలలు, లేదా ఆరునెలలు, ఒక సంవత్సరం తర్వాత మొదటి పింఛన్ చెల్లిస్తారు. ఈ పథకానికి సీనియర్ సిటిజన్స్ నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News