Home తాజా వార్తలు న్యూ లుక్‌కు అద్భుతమైన స్పందన

న్యూ లుక్‌కు అద్భుతమైన స్పందన


రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ’సాహో’ ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 15 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక మంగళవారం నుంచి ఈ స్టార్ హీరో ‘సాహో’ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఈ చిత్రం న్యూ లుక్ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆయన విడుదల చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో సోమవారమే పోస్ట్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు హయ్యస్ట్ గూగుల్ సెర్చ్ చేయటం కూడా రికార్డుగా నిలిచింది. ఇక న్యూ లుక్ పోస్టర్‌ని విడుదల చేసిన కొద్ది క్షణాల్లోనే 5 లక్షల లైక్స్ రావడం విశేషం. ఈ సందర్భంగా యువి క్రియేషన్స్ అధినేతలు వంశీ, -ప్రమోద్, -విక్కీలు మాట్లాడుతూ “ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం.

మూడు భాషల్లో ఒకేసారి షూట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటికే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1’కు అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే చిత్ర హీరోయిన్ శ్రద్ధా కపూర్ బర్త్‌డే కానుకగా విడుదల చేసిన ‘షేడ్స్ ఆఫ్ సాహో 2’ వీడియోకు మంచి స్పందన వచ్చింది. ‘సాహో’ను ఓ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజిత్‌తో పాటు హాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. హైటెక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్- -ఎహసాన్–లాయ్ సంగీతమందిస్తున్నారు. ప్రేక్షకులు, అభిమానుల అంచనాలను అందుకునేలా ‘సాహో’లో ప్రభాస్ స్టైలిష్‌గా ఓ కొత్త ఎనర్జీతో కనిపించబోతున్నారు.

Huge response to Saaho new Poster