Home తాజా వార్తలు బొగత జలకాలు

బొగత జలకాలు

Bogatha Waterfalls
మనతెలంగాణ/వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతం పర్యాటకులతో జనహోరును తలపించింది. ఆదివారం సెలవు దినం కావడంతో పలు ప్రాంతాల నుండి వచ్చిన పర్యాటకులతో జలపాతం వద్ద సందడి నెలకొంది. చిన్న,పెద్దతేడా లేకుండా జలపాతంలో ఈత కొడుతూ, సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. ప్రకృతి ఒడిలో నుండి జాలువారుతున్న జలపాతం అందాలు తిలకిస్తూ, పచ్చటి ప్రకృతిని పర్యాటకులు ఆస్వాదించారు. పుట్టిన రోజు సందర్భంగా పలువురు బొగత జలపాతం వద్ద కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. కుటుంబసమేతంగా జలపాతనికి తరలివచ్చిన పర్యాటకులు అక్కడే వంటలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. పర్యాటకుల ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన జిప్‌లైన్ ను ప్రారంభించినట్లు ఫారెస్టు రేంజర్ అధికారి డోలి శంకర్ తెలిపారు.

Huge Tourist Visits Bogatha Waterfalls