Home తాజా వార్తలు హెచ్‌యుఎల్ లాభం రూ.2,243 కోట్లు

హెచ్‌యుఎల్ లాభం రూ.2,243 కోట్లు

HUL net profit rises 17% to Rs 2,243 cr

 

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22) డిసెంబర్ ముగింపు నాటి మూడో త్రైమాసిక ఫలితాల్లో ఎఫ్‌ఎంసిజి దిగ్గజం హిందుస్తాన్ యునిలివర్ నికర లాభం రూ.2,243 కోట్లతో 17 శాతం పెరిగింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.1,921 కోట్లుగా ఉంది. కంపెనీ ఆదాయం రూ.13,183 కోట్లతో 10.23 శాతం పెరిగింది. గతేడాది ఆదాయం రూ.11,900 కోట్లుగా ఉంది. ఉత్పత్తుల అమ్మకాలు రూ.11,682 కోట్ల నుంచి రూ.12,900 కోట్లకు పెరిగాయి. లాభం, ఆదాయం విశ్లేషకుల అంచనాలను మించి వచ్చాయి. రెండో త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 2.56 శాతం, మొత్తం రెవెన్యూ 2.69 శాతం పెరిగాయి.

HUL net profit rises 17% to Rs 2,243 cr